ట్రిపుల్‌ మర్డర్‌ మిస్టరీ వీడింది..

| Edited By: Srinu

Nov 06, 2019 | 5:57 PM

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ మర్డర్‌ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని హత్యచేసి చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోకరు పరారైనట్లుగా తెలిపారు. జిల్లాలోని తనకల్లు మండలం కొర్తికోట శివాలయంలో జూలై 14న అర్దరాత్రి ముగ్గురు వ్యక్తులను అతి దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. శివాలయంలో నిద్రిస్తున్న ముగ్గుర్నిని బెడ్లతో గొంతు కోసి, బండరాళ్లతో మోదీ చంపేశారు. చనిపోయిన వారి […]

ట్రిపుల్‌ మర్డర్‌ మిస్టరీ వీడింది..
Follow us on
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ మర్డర్‌ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని హత్యచేసి చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోకరు పరారైనట్లుగా తెలిపారు. జిల్లాలోని తనకల్లు మండలం కొర్తికోట శివాలయంలో జూలై 14న అర్దరాత్రి ముగ్గురు వ్యక్తులను అతి దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. శివాలయంలో నిద్రిస్తున్న ముగ్గుర్నిని బెడ్లతో గొంతు కోసి, బండరాళ్లతో మోదీ చంపేశారు. చనిపోయిన వారి రక్తాన్ని మహా శివ లింగానికి అభిషేకం చేశారు. ఆలయం సమీపంలో ఉన్న పాముల పుట్టలో కూడా రక్తాన్ని పోశారు. శివాలయంలో రక్తం ఏరులుగా కనిపించిన దృశ్యం అందరిని భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో మృతిచెందిన వారు కమలమ్మ, సత్యలక్ష్మీ, శివరామిరెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. హత్యలకు ముందు రోజు క్షుద్ర పూజలు చేసినట్లుగా గుర్తించిన పోలీసులు.. గుప్త నిధుల కోసమే ముగ్గుర్ని చంపినట్లుగా అనుమానించారు.

అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు గుప్తనిధుల కోసమే మూడు మర్డర్లు చేసినట్లుగా విచారణలో తేల్చారు. అయితే, కొర్తికోటలో గల శివాలయం అతి పురాతనమైనది. ఇది శిథిలావస్థకు చేరటంతో దాని స్థానంలో రిటైర్డ్‌ టీచర్‌ శివరామిరెడ్డి కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి ఆయన అక్కాలిద్దరూ కమలమ్మ, బెంగళూరులో ఉంటున్న సత్యలక్ష్మి సహకరించారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో నిద్రిస్తున్న ఈ ముగ్గురూ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులంతా పాతికేళ్లలోపు వారే అని పోలీసులు వెల్లడించారు. హత్యలు చేశాక తవ్వకాలకు సమయం లేకపోవడంతో నిందితులు వెనక్కి వెళ్లిపోయారని, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాకు వెల్లడించారు.