
Illegal Liquor Transport: మద్యం అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో మార్గంలో ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో మద్యం తీసుకువచ్చి రాష్ట్రంలో అక్రమంగా విక్రయాలు సాగిస్తున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలూ తోడవడంతో విచ్చలవిడతనం పెరిగిపోతోంది. కాగా, బుధవారం నాడు గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో భారీ స్థాయిలో గోవా మద్యం పట్టుబడింది. 10 కేసుల గోవా మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కే. శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Also read: