Punganur Girl Missing Case: పుంగనూరు చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ.. పగతో రగిలిన ఓ కిరాతకురాలి ఘాతుకం

|

Oct 06, 2024 | 5:39 PM

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా మిస్టరీని చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని..

Punganur Girl Missing Case: పుంగనూరు చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ.. పగతో రగిలిన ఓ కిరాతకురాలి ఘాతుకం
Punganur Girl Missing Case
Follow us on

చిత్తూరు, అక్టోబర్‌ 6: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా మిస్టరీని చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అన్నారు. పుంగనూరులో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మహిళలతోపాటు ఒక మైనర్ బాలుడుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో తల్లి, కూతురుతోపాటు మైనర్ బాలుడు ఉన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని, విచారణ పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్న ఎస్పీ తెలిపారు.

అసలేం జరిగిందంటే..

హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి తండ్రి స్థానికంగా ఉంటున్న హసీనా అనే ఓ మహిళ వద్ద రూ.మూడున్నర లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆమెకు తిరిగి రుణం డబ్బు సకాలంలో చెల్లించలేకపోవడంతోపాటు ఆమెను దూషించాడు. పైగా సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరించాడు కూడా. దీంతో సదరు మహిళ అతనిపై పగ పెంచుకుంది. ప్రతీకారంతో రగిలిపోయిన ఆమె.. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని తన వెంట తీసుకెళ్లింది. చిన్నారిని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. అనంతరం హసీనా, ఆమె కుమార్తె రేష్మ, మరో మైనర్‌ బాలుడు అఖిల్‌ సహాయంతో చిన్నారి ముక్కు, నోరు గట్టిగా మూసి ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడింది. హత్య అనంతరం చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్‌లో పడేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చిన్నారి కనబడకుండా పోయిన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైంది.

ఈ హత్యకు పాల్పడిన హసీనా, ఆమె కుమార్తె రేష్మ, హత్యకు సహకరించిన మైనర్ బాలుడు అఖిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈచిన్నారి శరీరంపై ఎలాంటి గాయం లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారిని హత్య చేసిన వారిని పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మీడియాపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస నిబంధనలు పాటించకుండా కొన్ని ఛానెళ్లు చిన్నారి పేరు, ఫొటోలను ప్రసారం చేశారన్నారు. ఇలాంటి విషయాల్లో మీడియా బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.