జైలుకు వెళ్లి వచ్చినా.. మారని బుద్ధి.. పక్కా సమాచారం పట్టుబడ్డ నయవంచకుడు..!

|

Jan 16, 2025 | 10:16 AM

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు అవుతున్న ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయా మాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదన్నారు.

జైలుకు వెళ్లి వచ్చినా.. మారని బుద్ధి.. పక్కా సమాచారం పట్టుబడ్డ నయవంచకుడు..!
Palnadu Crime
Follow us on

రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలం తప్పన్నగారిపల్లి గ్రామానికి చెందిన అమాస భాను అలియాస్ పవన్ అలియాస్ రాజేష్ ‌ను అదుపులోకి తీసుకున్న సత్తెనపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.

గతంలో రాజకీయ నాయకుల వద్ద PRO గా పని చేసిన అమాస భాను చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చాలా మంది నాయకులు తెలుసని ఆ పలుకబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. దీంతో అతనిపై చిత్తూరు జిల్లాలోనే పలు కేసు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఒక హత్యాయత్నం కేసులో అతన్ని చిత్తూరు జిల్లా సోమ్లా పోలీసులు జైలుకు పంపించారు. ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు.

ఆ క్రమంలో మరోసారి మోసానికి పాల్పడుతూ దొరికిపోయారు. ఉద్యోగాలను ఇప్పిస్తానని చీటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని సపోర్ట్ తో సత్తెనపల్లి నియోజకవర్గంలోని పొలిటికల్ వాట్సాప్ గ్రూప్‌ల్లోని సభ్యుల ఫోన్ నంబర్లను సేకరించాడు. వారికి ఫోన్లు చేసి రాజమండ్రి, తిరుపతి రేణుగుంట ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఫోన్ పే ద్వారా డబ్బులు వేయించుకుని ఉడాయించాడు. బాధితులు పలుమార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు.

జాబులు పేరుతో మోసం చేస్తూ ఆర్దిక నేరాలకు పాల్పడుతున్నాడని, బాధితుల ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి టౌన్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా SP ఆదేశాల మేరకు సత్తెనపల్లి టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి అమాస బానుతో పాటు నాగమల్లేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో నిందితులిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కాగా, ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వారి మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..