PM Narendra Modi: సేంద్రియ సేద్యాన్ని కొనసాగించండి.. 102 ఏళ్ల నంద్యాల రైతు సమాఖ్యపై ప్రధాని మోడీ ప్రశంసలు

|

Jan 08, 2024 | 9:37 PM

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర భాగంగా దేశంలోని వేలాదిమంది రైతులతో సోమవారం (జనవరి 08) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 102 ఏళ్ల ఓ రైతు సమాఖ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కోపరేటివ్ సొసైటీలో మొత్తం 5వేల 6వందల మంది సభ్యులున్నారు

PM Narendra Modi: సేంద్రియ సేద్యాన్ని కొనసాగించండి.. 102 ఏళ్ల నంద్యాల రైతు సమాఖ్యపై ప్రధాని మోడీ ప్రశంసలు
PM Narendra Modi
Follow us on

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర భాగంగా దేశంలోని వేలాదిమంది రైతులతో సోమవారం (జనవరి 08) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 102 ఏళ్ల ఓ రైతు సమాఖ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కోపరేటివ్ సొసైటీలో మొత్తం 5వేల 6వందల మంది సభ్యులున్నారు. కేంద్రం ఇచ్చిన మూడుకోట్ల రుణంతో ఈ సమాఖ్య సభ్యులు ఐదు గోదాములను నిర్మించుకున్నారు. ఈ-నామ్‌, ఈ-మండి వ్యవస్థల ద్వారా పంటకు మెరుగైన ధర దక్కించుకుంటున్నారు. వికసిత భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆ కోపరేటివ్ సొసైటీలో సభ్యుడైన మొయినుద్దీన్‌తో మాట్లాడారు. కేంద్రం పథకాలను ఎలా అందిపుచ్చుకున్నారో తెలుసుకున్నారు. సేంద్రీయ సేద్యాన్ని కూడా కొనసాగించాలని సూచించారు. కాగా పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. అర్హులైన ప్రభుత్వ పథకాల లబ్ధిరాలందరినీ గుర్తించేలా చూడడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని మోడీ పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి