PM Modi – Pawan Kalyan: ఏపీలోని విశాఖపట్నం నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ స్వాగతం పలికారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. ప్రధాని మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగా ల్యాండయిన మోడీ.. అక్కడినుంచి మారుతి జంక్షన్ వరకు రోడ్ మార్గంలో వెళ్లారు. విశాఖ వాసులకు కారునుంచి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. అనంతరం ఐఎన్ఎస్ చోళాకు చేరుకున్న మోడీ.. జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. భేటీ ముగిసిన కాసేపటికి ఏపీ బీజేపీ ముఖ్యనేతలతో మోడీ భేటీ అయ్యారు. పవన్ కంటే ముందుగా బీజేపీ నేతలతో మీటింగ్ షెడ్యూల్‌లో ఉన్నా.. మోడీ.. పవన్‌తోనే ముందుగా మాట్లాడారు. పైగా 10 నిమిషాల టైమ్ ఇచ్చి 35నిమిషాలు చర్చించారు. ఆ తర్వాతే బీజేపీ నేతలతో మీటింగ్ నిర్వహించారు.
కాగా.. ప్రధాని మోడీతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన మీటింగ్ వివరాలను పవన్ వెల్లడించలేదు. 8ఏళ్ల తర్వాత మోదీతో భేటీ అయ్యాను.. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ అంటూ పేర్కొన్నారు. ఏపీ బాగుండాలన్నదే ప్రధాని ఆకాంక్ష అని.. ఏపీలోని అన్ని విషయాలు మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. ఇక ఏపీకి మంచిరోజులు వస్తాయని నమ్ముతున్నా అంటూ పవన్ పేర్కొన్నారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, సాదర స్వాగతం నడుమ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం చేరుకున్నాను. pic.twitter.com/alE1F8yTZy
— Narendra Modi (@narendramodi) November 11, 2022
ఇంతకీ మోదీ, పవన్ తో ఏం మాట్లాడారు.? అడిగిన రూట్ మ్యాప్ మోదీ ఇచ్చారా.? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు కూడా ఉంచారా?. టీడీపీకి పవన్ దగ్గర అవుతున్న క్రమంలో మోదీ ఏం మాట్లాడారు? షెడ్యూల్ టైమ్‌కి మించి ఇద్దరి మధ్య జరిగిన చర్చపై ఉత్కంఠ రేపుతోంది. పవన్ తో చర్చలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలతో భేటీ అయిన మోదీ, పవన్ లేవనెత్తిన సమస్యలను తెలుసుకున్నట్లు సమాచారం.
కాగా, మదురైలో వాతావరణం అనుకూలించక కాస్త ఆలస్యంగా విశాఖ చేరుకున్నారు మోదీ. 8.10కి INS డేగ లో ల్యాండ్ అయిన ప్రధాని.. అక్కడి నుంచి మారుతీ జంక్షన్‌కు చేరుకున్నారు. తన కోసం ఎదురుచూస్తున్న విశాఖ వాసులకు కారు నుంచే అభివాదం చేశారు. మెల్లిగగా మూవ్ చేస్తూ INS చోళ వరకూ వెళ్లారు మోదీ. ప్రజలు కూడా సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్లతో మోదీకి స్వాగతం పలికారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..