
PM Modi’s Kurnool visit Live Updates: ప్రధాని మోదీ శ్రీశైలం నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు. ప్రధానితోపాటు బహిరంగసభలో చంద్రబాబు, పవన్, మంత్రులు పాల్గొననున్నారు. గంటన్నరపాటు ఉండనున్న ప్రధాని మోదీ.. సభా వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మొత్తం 13వేల 400కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.
ఈ ప్రారంభోత్సవ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించినవని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలతో కలిసి సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్న అనంతరం.. సాయంత్రం 4:45కు కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.
https://www.youtube.com/watch?v=mtjpUq1FXL8
విద్యుత్ రంగంలో రూ.3 వేల కోట్ల విలువైన.. ప్రాజెక్ట్‌లను ప్రారంభించుకున్నాం-ప్రధాని మోదీ
దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ కేరాఫ్
15 లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందిస్తాం
రైల్వేల్లో కొత్త యుగం ప్రారంభమైంది
2047నాటికి వికసిత్ భారత్ సంకల్పంతో సాగుతున్నాం
వికసిత్ భారత్ లక్ష్యానికి స్వర్ణాంధ్ర ఎంతో ఉంది
భారత్, ఏపీ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోంది
గూగుల్‌లాంటి కంపెనీ ఏపీలో పెట్టుబడి పెడుతోంది
సబ్ సీకేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్ వే అవుతుంది
విశాఖ నుంచే ప్రపంచానికి సేవలు అందబోతున్నాయి
చంద్రబాబు విజన్‌కు నా ప్రత్యేక ప్రశంసలు
ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి చాలా ముఖ్యం
రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉపాధిప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తాం..
– ప్రధాని మోదీ
చంద్రబాబు చెప్పినట్టు 21వ శతాబ్ధం భారతావనిదే.. రోడ్లు, రైల్వేలతో కనెక్టివిటీ పెంచుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 16 నెలల్లో ఏపీలో అభివృద్ధి దూసుకుపోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ముఖచిత్రం మారుతుందని పేర్కొన్నారు.
ఆత్మగౌరవం, సంస్కృతికి ఏపీ నిలయం.. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉంది
చంద్రబాబు, పవన్ రూపంలో.. ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది
కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తున్నాం
16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోంది
అభివృద్ధికి ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి
2047 నాటికి వికసిత్ భారత్‌గా నిలుస్తాం-మోదీ
సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టాను.. విశ్వనాథుడికి సేవ చేసే భాగ్యం కలిగింది.. అహోబిలం, మహానంది, మంత్రాలయంలోని.. స్వాముల వారి ఆశీస్సులు కోరుకుంటున్నా అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. మల్లిఖార్జునస్వామి ఆశీస్సులు పొందా.. శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించా అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో పర్యటిస్తున్నారు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్ అని.. ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోదీ.. సభా వేదిక పైనుంచి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం 13వేల 400కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
సూపర్ GSTతో సూపర్ సేవింగ్.. సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. GST సంస్కరణలు తెచ్చిన మోదీకి ధన్యవాదాలు చెప్పారు. మన శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్‌తో మోదీ చూపించారని.. రాబోయే శతాబ్దాలకు మోదీ పునాది వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. 2038నాటికి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతామన్నారు. మాటలు కాదు, చేతల్లో చూపించే నేత అని.. ఇలాంటి నేతను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. చాలామంది ప్రధానమంత్రులతో పనిచేశానని.. కానీ.. ప్రధాని మోదీ లాంటి వ్యక్తిని చూడలేదన్నారు. వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్ తెచ్చారని… జీఎస్టీతో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15 వేలు ఆదా అవుతుందన్నారు. అన్ని వర్గాలకు మేలుచేసేలా మోదీ సంస్కరణలు ఉన్నాయన్నారు.
సూపర్ GSTతో సూపర్ సేవింగ్-చంద్రబాబు
సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ
25 ఏళ్లుగా దేశానికి అద్భుతంగా సేవలందిస్తున్నారు
GST సంస్కరణలు తెచ్చిన మోదీకి ధన్యవాదాలు
మనశక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్‌తో మోదీ చూపించారు
రాబోయే శతాబ్దాలకు మోదీ పునాది వేశారు
2038నాటికి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతాం
మాటలు కాదు, చేతల్లో చూపించే నేత మోదీ-చంద్రబాబు
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మనందరి భవిష్యత్తును కాపాడే నేతని.. సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా దేశానికి అద్భుతంగా అహర్నిశలు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మోదీ లాంటి నేతను చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం -పవన్ కల్యాణ్
ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు
కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి
ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడి ఉంటాం
మోదీ నాయకత్వంలో సమిష్టిగా ముందుకు వెళ్తాం
ప్రధాని మోదీ.. కర్మ యోగి.. అని.. ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సేవ చేస్తున్నారని.. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడని.. భారత్ ను అగ్రగ్రామిగా నిలుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
నమో అంటేనే విక్టరీ: మంత్రి లోకేష్
మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే
దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చింది మోదీనే
మోదీ దెబ్బకు పాకిస్తాన్ దిమ్మతిరిగింది
ట్రంప్ టారిఫ్‌లతో పెద్ద పెద్ద దేశాలు వణికినా.. మోదీ మాత్రం బెదరలేదు
దసరా, దీపావళి కలిసి వస్తే ఇలానే ఉంటుంది
పేదరికం లేని దేశమే మోదీకి పండుగ
-లోకేష్
భారత ప్రధాని నరేంద్రమోదీ భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నమో అంటేనే విక్టరీ అని.. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చారని పేర్కొన్నారు. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు బుద్ది చెప్పారని పేర్కొన్నారు.
మోదీ సభకు 7వేల 500మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. మోదీ టూర్‌తో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించి.. ట్రాఫిక్ ఆంక్షలు ఆంక్షలు విధించారు. ప్రధాని సభకు భారీ జనసమీకరణ చేశారు.. 7వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 3లక్షల మంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణం రెడీ చేశారు. తిరిగి, సాయంత్రం 4:45కి కర్నూలు ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు
ప్రధాని మోదీ శ్రీశైలం నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు. ప్రధానితోపాటు బహిరంగసభలో చంద్రబాబు, పవన్, మంత్రులు పాల్గొననున్నారు. గంటన్నరపాటు ఉండనున్న ప్రధాని మోదీ.. సభా వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మొత్తం 13వేల 400కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
మధ్యాహ్నం 2:30కి కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొననున్న మోదీ
ప్రధానితోపాటు బహిరంగసభలో పాల్గొనను చంద్రబాబు, పవన్, మంత్రులు
గంటన్నరపాటు ఉండనున్న ప్రధాని మోదీ.. సభా వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మొత్తం 13వేల 400కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మోదీ సభకు 7వేల 500మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత
మోదీ టూర్‌తో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు.. ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని సభకు భారీ జనసమీకరణ.. 7వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు
3లక్షల మంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణం
తిరిగి, సాయంత్రం 4:45కి కర్నూలు ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి మోదీ
శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించిన ప్రధాని
శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ ధ్యానం
40నిమిషాలపాటు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో గడపనున్న మోదీ
ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు
భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న మోదీ
ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రధాని మోదీ
భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్న మోదీ
మల్లికార్జున స్వామి రుద్రాభిషేకంలో పాల్గొన్న మోదీ
శ్రీశైలం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు
దాదాపు 50 నిముషాల పాటు స్వామివారి సన్నిధిలో మోదీ ప్రత్యేక పూజలు
12 .10 కు శివాజి స్ఫూర్తి కేంద్రం సందర్శన
12.15 నుంచి 12. 35 వరకు శివాజి దర్బార్ హాల్, ధ్యాన మందిరంను సందర్శించనున్న మోదీ
హెలికాప్టర్‌లో శ్రీశైలంలో బయల్దేరిన ప్రధాని మోదీ
శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్రమోదీ
భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకుని పూజలు చేయనున్న ప్రధాని
కర్నూలు: ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
కాసేపట్లో శ్రీశైలానికి ప్రధాని మోదీ
శ్రీశైలం క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధాని
ప్రత్యేక మివానంలో కర్నూలుకు ప్రధాని మోదీ
ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు
మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం రానున్నారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొనున్నారు ఈ సందర్భంగా శ్రీశైలం ముస్తాబయింది మోడీ రాక సందర్భంగా శ్రీశైలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని పర్యటనను సూపర్ సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు
స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు
గత ఐదు రోజులుగా కర్నూలు లోనే మకాం వేసి ఏర్పాట్లను చేపట్టిన 12 మంది మంత్రులు
శాఖల వారీగా బాధ్యతలు పంచుకుంటూ, సమిష్టిగా సభ ఏర్పాట్లపై సమీక్షించుకుంటూ కర్నూలులోనే ఉన్న మంత్రులు
కర్నూలు సభతో పాటు శ్రీశైల దేవాలయంలో ఏర్పాట్లపై పలుదఫాలు సీఎం సమీక్ష
9 గంటల 50 నిమిషాలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు
9 గంటల 55 నిమిషాలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి సున్నిపెంటకు ప్రధాని
అక్కడ నుంచి రోడ్డు మార్గాన భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న ప్రధాని
11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ప్రధాని
ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరనున్న ప్రధాని మోదీ
9 గంటల 50 నిమిషాలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు
9 గంటల 55 నిమిషాలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి సున్నిపెంటకు ప్రధాని
అక్కడ నుంచి రోడ్డు మార్గాన భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న ప్రధాని
11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ప్రధాని