సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం…. మృతుల‌ కుటుంబాలకు పరిహారం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం.... మృతుల‌ కుటుంబాలకు పరిహారం..
Modi

Updated on: Apr 30, 2025 | 10:27 AM

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షానికి రూ.300 క్యూలైన్ దగ్గర గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. కాగా, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పన్న స్వామి సన్నిధిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..