AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..14మంది సజీవ దహనం..!

బాధిత ప్రజలను రక్షించడం, వారికి అవసరమైన సహాయం అందించడం వంటి వివరాలను ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..14మంది సజీవ దహనం..!
Kolkata Fire
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2025 | 7:39 AM

Share

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కోల్‌కతాలోని ఒక హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. జరిగిన అగ్నిప్రమాదంలో14 మంది మృతి చెందినట్టుగా తెలిసింది.. సెంట్రల్ కోల్‌కతాలోని ఫలపట్టి మచ్చువా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8:15 గంటల ప్రాంతంలో రీతురాజ్ హోటల్‌లో మంటలు చెలరేగాయని కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. 14 మృతదేహాలను వెలికితీశామని, అనేక మందిని రక్షించామని ఆయన చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు. మరోవైపు, జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. బాధిత ప్రజలను రక్షించడం, వారికి అవసరమైన సహాయం అందించడం వంటి వివరాలను ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..