మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించాడు. పేరు చెప్పడం ఇష్టం లేని ఒక పార్టీ అధ్యక్షుడు నిన్న తియ్యటి అబద్ధాలు చెప్పారని.. ఎవరి మీద ద్వేషంతో పార్టీ పెట్టారో.. ఎవరిని రాజకీయంగా అడ్డుకోవాలనీ చూసారో.. ఎవరి మేలు కోసం చెయ్యాలో అదే నిన్న మళ్ళీ చెప్పారని పేర్ని నాని చెప్పాడు. అంతేకాదు బీజేపీతో కటింగ్ చెప్పేశాడు.. మళ్ళీ టీడీపీతో వెళ్లేందుకు సిద్దం అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు మోడీ అంటే భయం.. అందుకే అమిత్ షా, జేపీ నడ్డా మంచోడు అంటున్నాడు.. అసలు తనకు కులభావన లేదని చెప్పిన వ్యక్తి కాపు కులస్తులను రెచ్చగొట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని.
అంతేకాదు కమ్మోల్ల మీద ద్వేషం ఎందుకని కాపులను రెచ్చగొడుతున్నాడు.. నీ రాజకీయం కోసం రంగా పెళ్లి పైన అయన కుటుంబంపైన నిస్సిగ్గుగా మాట్లాడతావా అంటూ ఎద్దేవా చేశారు. అసలు కమ్మవారి తో వెళ్ళాలి అనుకున్న నువ్వు.. ఇలా వ్యాఖ్యలు చేయడం అవసరమా అంటూ పవన్ పేరుని ప్రస్తావించకుండా ప్రశ్నించారు పేర్ని నాని..
టిడిపి, జనసేన,కమ్యూనిస్టులు అందరూ కలిసే రావాలని అధికార పార్టీ కోరుతున్నట్లు చెప్పారు. అంతేకాదు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని మీరంతా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వరకు కాకుండా ఇప్పుడే ముసుగు తీసి ప్రజల ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు.
మీ అవసరాల కోసం 2014కలిసే పోటీ చేశారు. 2019 లో వీడి విడిగా పోటీ చేశారు. రానున్న ఎన్నికల్లో అంటే 2024 లో మళ్ళీ మీరంతా కలిసి వస్తే.. మిమల్ని ఎన్నికల్లో చితకొట్టి చూపిస్తామంటూ సవాల్ చేసారు పేర్ని నాని. అసలు అబద్ధాలు ఎవడు చెప్పాడు. మీరు చెప్పరా మేము చెప్పామా.. అయినా మేము తొడలు కొట్టే పార్టిలో మేము లేము.. తొడలు కొట్టే పార్టీలో ఉన్నది మీరే.. అసలు ధృతరాస్టులు, దుర్యోధనులు అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
మాతో శిస్తు కట్టించడం నీ వల్ల కాదూ కదా నీ యజమాని వల్ల కూడా కాదు… అసలు నువ్వు 2009లో రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పడం ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీని ప్రస్తావించారు పేర్ని నాని.
మీ ఆన్న కేంద్ర మంత్రిగా చేశాడు మీ ఇంట్లో ఎవ్వరూ రాజకీయాల్లో లేరని చెప్పడం ఏంటి.? అసలు చిరంజీవి ఓడిపోతే ఒంటరిగా వదిలేసింది నువ్వు కాదా.? తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ మేత కోసం ఎక్కా అన్నట్లు ఉంది పవన్ కళ్యాణ్ వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని.
సినిమాకు రోజుకు రెండూ కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ ఇన్కమ్ టాక్స్ కడుతున్నాడా… డబ్బులు లేవు అంటున్నాడు రెండు కోట్లు తీసుకుంటున్నా అంటున్నాడు. అసలు ఏది నిజమో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ కు కులం, ఓట్లు తప్పా ఇంకేమైనా ఉందా… అసలు అతడిని తిట్టాల్సిన అవసరం మాకు లేదు.. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరామో మా ఇల్లు అంతే దూరం. నీ గుణం, నీ సంకల్పం గొప్పది అయితే నీ చుట్టూనే తిరుగేవాళ్ళం.. మేము
జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతామన్నారు.
జనం కోసం మొండిగా నిలబడి నమ్మిన సిద్ధాంతం కోసం పని వ్యక్తి జగన్ కాబట్టే అయన వెంట నడుస్తున్నాం. నీ దగ్గర ఏమున్నాయని మేము మీ దగ్గరకు రావాన్నారు. చంద్రబాబు దిక్కు తోచక ప్రభుత్వాన్ని వెలు పెట్టీ చూపించలేక పవన్ కల్యాణ్ తో వెనకుండి మాట్లాడిస్తున్నాదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
2018లో చంద్రబాబును నానా మాటలు మాట్లాడిన నువ్వు ఇప్పుడు నీతులు చెప్తున్నావు.. అసలు నీ మాటలను కాపులు నమ్మరని.. 60శాతం కాపులు సీఎం జగన్ తోనే ఉన్నారని చెప్పారు. కులాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయడం ధర్మమా అంటూనే.. కులం పేరుతో చేస్తున్న రాజకీయా క్రీడను నిలిపివేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నేరుగా వస్తే.. తాము ఏంటో చూపిస్తామని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులు బంద్ చేస్తే ప్రభుత్వమే బంద్ లో పాల్గొంది. స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేయొద్దని ప్రభుత్వం కోరింది. కుల రహిత సమాజం కోసం పోరాడే వ్యక్తి నిన్న కులాల పేర్లు పదే పదే ఎందుకు ప్రస్తావించారన్నారు పేర్ని నాని..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..