సీరియల్‌కి అయినా ముగింపు ఉంటుందేమో గానీ.. ఆ రోడ్డుకు మాత్రం శుభం కార్డు పడేలా లేదు..!

|

Dec 31, 2021 | 8:36 PM

Ananthapuram Road: అప్పట్లో మొదలైన టీవీ సీరియల్‌ కూడా అయిపోయుంటుంది. కానీ.. ఆ రోడ్డు పనులు ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డేస్తున్నారనే ఆనందం కన్నా..

సీరియల్‌కి అయినా ముగింపు ఉంటుందేమో గానీ.. ఆ రోడ్డుకు మాత్రం శుభం కార్డు పడేలా లేదు..!
Road Construction
Follow us on

Ananthapuram Road: అప్పట్లో మొదలైన టీవీ సీరియల్‌ కూడా అయిపోయుంటుంది. కానీ.. ఆ రోడ్డు పనులు ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డేస్తున్నారనే ఆనందం కన్నా.. పనుల జాప్యం వల్ల ప్రాణాలు పోతున్నాయనే భయం స్థానిక జనాల్లో ఎక్కువైంది. ఇంతకీ ఆ నరకపుదారి ఎక్కడ?

అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి బళ్లారి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులివి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఎస్‌ రవికుమార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. రోడ్డు ఎన్నటికి మనుగడలోకి వస్తుందో తెలియదు. దీని గురించి అడిగే నాథుడు లేడు, సమాధానం చెప్పేవారూ లేదు. వానాకాలం వస్తే బురద. చలికాలం, ఎండాకాలాల్లో పరిసరాల్ని కమ్మేసే దుమ్ము.. నరకం చూపిస్తున్నాయి జనాలకు. ఇదీ మొత్తంగా ఇక్కడి దుస్థితి.

రోడ్డు పనులు.. పూర్తికాకపోవడం అటుంచితే.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం జనాల ప్రాణాలకు మీదకొస్తోంది. పనుల కోసం తవ్వుతున్న గుంతల్లో పడి.. ప్రాణాలు కోల్పోతున్నారు ప్రయాణికులు. వాహనాలపై నుంచి జారిపడటం. కాళ్లూ, చేతులు విరగ్గొట్టుకోవడం స్థానికులకు మామూలైపోయింది. డోనెకల్‌ దగ్గర రోడ్డు పనుల కోసం తవ్విన గుంటలో కారుపడి.. ఒకరు జలసమాధి అయిన ఘటనను టీవీ9 వెలుగులోకి తెచ్చింది. టీవీ9 ఇచ్చిన ధైర్యంతో అక్కడి పిల్లలు, పెద్దలు ఆందోళన బాటపట్టారు. అయితే, కొందరు పోలీసులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతూ తమను బెదిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఏళ్లుగా కొనసాగుతున్న.. గుంతకల్లు, బళ్లారి హైవే పనులతో నిత్యం నరకం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సదరు కాంట్రాక్ట్‌ కంపెనీపై చర్యలు తీసుకుంటారా? లేక? పనులు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలిస్తారా? అనేది చూడాలి.

Also read:

KCR vs Etela Rajender: వ్యూహం మార్చిన కేసీఆర్.. ఈటలకు రివర్స్ ఝలక్.. ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా?..

Skin Care Tips: ఈ ఐడియా ఇప్పటిది కాదు.. శీతాకాలంలో పట్టులాంటి చర్మం కోసం కొబ్బరి నూనెతో ఫేస్ మాస్క్..

Under 19 Asia Cup: అండర్-19 ఆసియా కప్‎లో మెరిసిన కుర్రాళ్లు.. అదరగొట్టిన ఆ ఐదుగురు ఎవరంటే..