AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Under 19 Asia Cup: అండర్-19 ఆసియా కప్‎లో మెరిసిన కుర్రాళ్లు.. అదరగొట్టిన ఆ ఐదుగురు ఎవరంటే..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది.

Under 19 Asia Cup: అండర్-19 ఆసియా కప్‎లో మెరిసిన కుర్రాళ్లు.. అదరగొట్టిన ఆ ఐదుగురు ఎవరంటే..
Five Players
Srinivas Chekkilla
|

Updated on: Dec 31, 2021 | 8:10 PM

Share

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 106 పరుగులకే ఆలౌట్ అయింది. వర్షం కారణంగా 38-38 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియాకు 102 పరుగుల విజయలక్ష్యాన్ని 22 ఓవర్లలో ఛేదించింది. అంగ్‌క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్‌ రాణించారు. అండర్-19 ఆసియా కప్‌లో భారత్ వరుసగా మూడోసారి విజేతగా నిలవగా, ఈ టోర్నీలో మొత్తం 8 సార్లు విజేతగా నిలిచింది. ఈసారి భారత్ విజయంలో ఐదుగురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ షేక్ రషీద్ భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఈ 17 ఏళ్ల బ్యాట్స్‌మెన్ అత్యధికంగా 133 పరుగులు చేశాడు. రషీద్ సగటు 66.50. నాలుగు ఇన్నింగ్స్‌లలో రెండింటిలో నాటౌట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో షేక్ రషీద్ కేవలం 6 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే కొట్టాడు.

ఓపెనర్ హర్నూర్ సింగ్ అండర్-19 ఆసియా కప్‎లో రాణించాడు. హర్నూర్ 4 మ్యాచ్‌ల్లో 131 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. హర్నూర్ సగటు 32.75 అయినప్పటికీ అతను టీమ్ ఇండియాకు శుభారంభాన్ని అందించాడు.

టీమ్‌ఇండియా తరుఫున ఆఖరి మ్యాచ్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. అతను 56 పరుగులు చేసి శ్రీలంకను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. రఘువంశీ 35.66 సగటుతో మొత్తం 107 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రాజ్ అంగద్ బావా భారత్ తరఫున 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఘనతను కూడా బావ సాధించాడు.

భారత్ విజయంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్ కీలక పాత్ర పోషించాడు. ఓస్త్వాల్ 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో ఓస్త్వాల్ 3 వికెట్లు పడగొట్టాడు.

Read Also.. Under-19: తాత ఒలింపిక్ పతక విజేత.. తండ్రి కోచ్.. ఇప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడంటే..