Andhra Pradesh: వాన అంటేనే వణుకుతున్న జనం.. వాతావరణశాఖ ప్రకటనతో బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 3:56 PM

వానొస్తుందంటే ఎవరైనా సంతోషిస్తారు. కానీ వాళ్లు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గత నెలలో కురిసిన వానల నుంచే వారు ఇంకా తేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మన్యం వాసుల దయనీయ పరిస్థితి ఇది....

Andhra Pradesh: వాన అంటేనే వణుకుతున్న జనం.. వాతావరణశాఖ ప్రకటనతో బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు
Konaseema Floods
Follow us on

వానొస్తుందంటే ఎవరైనా సంతోషిస్తారు. కానీ వాళ్లు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గత నెలలో కురిసిన వానల నుంచే వారు ఇంకా తేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మన్యం వాసుల దయనీయ పరిస్థితి ఇది. ఏజెన్సీ ప్రాంత ప్రజలను వాన భయం వెంటాడుతోంది. వర్షమెస్తుందంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే సుమారుగా 53 రోజులుగా వరద నీటిలోనే చిక్కుకొని అల్లాడుతున్న ప్రజలకు మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఎటపాక మండలాల ప్రజలు ముంపులో చిక్కుకున్నాయి. గోదావరి నది ముంచెత్తడంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో వర్షపు నీరు చేరింది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు రావడంతో గోదావరి, దాని ఉపనది శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాటి వరద నీటిలో చిక్కుకొని కొట్టిమిట్టాడుతున్నాయి ఏజెన్సీ ప్రాంత మండలాలు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు కురిస్తే నిలువ నీడ కూడా ఉండదనే భయంతో ఆవేదన చెందుతున్నారు.

కాగా.. జులై నెలలో కురిసిన వర్షాలు, గోదావరికి వచ్చిన వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వీలినమైన పలు మండలాలు నీట మునిగాయి. గోదావరి, శబరి నది ప్రవాహంతో గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. భద్రాచలం పట్టణం సగం మేర నీట మునిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. బతుకుజీవుడా అంటూ తలోదిక్కు పరిగెత్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కాగా.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పోటెత్తుతుండడంతో ఆయా మండలాలు రోజుల తరబడి నీటిలోనే ఉంటున్నాయి. వరద తగ్గినప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి