Andhra Pradesh: ఏపీలో ఎమ్మార్వో ఆత్మహత్య.. ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్‌ఆర్ఓ ఆత్మహత్య కలకలం రేపింది. కార్యాలయానికి వచ్చిన కాసేపటికే.. ఎమ్మార్వో బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్‌ఆర్ఓ ఆత్మహత్య కలకలం రేపింది. కార్యాలయానికి వచ్చిన కాసేపటికే.. ఎమ్మార్వో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబయలు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు.. టిఫిన్ తీసుకురావాలని అటెండర్‌కు సూచించారు. అటెండర్ టిఫిన్ తీసుకుని తిరిగి కార్యాలయానికి వెల్లారు. ఈ సమయంలో శ్రీనివాసరావు అక్కడ కనిపించలేదు.. కార్యాలయం పక్కన ఉన్న షెడ్‌లో శ్రీనివాసరావు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు.
దీంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో తహసీల్దార్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
కాగా.. ఇటీవల పాడేరు కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి తహసీల్దార్ శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సమావేశంలో భూముల రీ సర్వే విషయంలో ఉన్నతాధికారులు శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..