Pawan Kalyan: నేడు జనసేనాని వారాహి విజయ యాత్ర సెకండ్ ఫేజ్ ప్రారంభం.. సాయంత్రం ఏలూరులో బహిరంగ సభ

|

Jul 09, 2023 | 7:18 AM

ఇవాళ ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను పవన్‌ ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని.. నేడు జరగనున్న యాత్ర వివరాలు, ఏలూరు సభ ఏర్పాట్ల గురించి పార్టీ నేతలపై చర్చించారు.

Pawan Kalyan: నేడు జనసేనాని వారాహి విజయ యాత్ర సెకండ్ ఫేజ్ ప్రారంభం.. సాయంత్రం ఏలూరులో బహిరంగ సభ
Pawan Kalyan (File Photo)
Follow us on

డైలాగులు దంచుడు..పంచులు పేల్చుడు. అధికార వైసీపీపై నిప్పులు చెరుగుడు. ఇదీ మొదటి విడత వారాహి యాత్రలో కనిపించింది, వినిపించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు రెండో విడత వారాహి యాత్రపైనే ఉంది. పొలిటికల్‌ భీమ్లా నాయక్‌ స్పీచ్‌లో అదే దూకుడు కంటిన్యూ చేస్తారా..? పార్ట్‌-2 వారాహి యాత్రలో పవన్‌ వ్యూహం ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది

ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజోలు, మల్కిపురం, నరసాపురం, భీమవరం ప్రాంతాల్లో  జరిపిన మొదటి విడత వారాహి యాత్రకు భారీ స్పందన లభించింది. జనసేన అధినేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. దీంతో వారాహి విజయ యాత్ర సెకండ్ ఫేజ్ ను కూడా సక్సెస్ చెయ్యాలని  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఏలూరు నుంచి రెండోదశ యాత్ర ప్రారంభించేందుకు పవన్ రెడీ అయ్యారు. మొదటి విడత విజయ యాత్రను అన్నవరం సత్యనారాయ స్వామిలో పూజలు చేసి శ్రీకారం చుట్టిన వారాహి విజయ యాత్ర భీమవరం వరకు సాగింది. తాజాగా రెండో విడత యాత్రలో భాగంగా ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. రెండో విడత వారాహి యాత్ర ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ ఇప్పటికే జనసేన ముఖ్య నేతలతో సమీక్షను నిర్వహించారు.

ఇవాళ ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను పవన్‌ ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని.. నేడు జరగనున్న యాత్ర వివరాలు, ఏలూరు సభ ఏర్పాట్ల గురించి పార్టీ నేతలపై చర్చించారు.

ఇవి కూడా చదవండి

ఏలూరులో జనసేన అధినేత జూలై 10వ తేదీ మధ్యాహ్నం జనవాణి నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. 11వ తేదీన జనసేన వీర మహిళలు, దెందులూరులో ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం తాడేపల్లి గూడెం చేరుకొని అక్కడే బస చేయనున్నారు. మర్నాడు అంటే 12వ తేదీ సాయంత్రం తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని జనసేనాని  ప్రసంగించనున్నారు.

పవన్ కళ్యాణ్ తమ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు. కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. అంతేకాదు జనసేనకు పట్టుగలిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న  రెండో విడత వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన శ్రేణులు.

పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకులు రెడీ అవుతున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. రహదారులను జనసేన ప్లెక్సీలు, జెండాలతో నింపేశారు. మార్పు మొదలైంది అంటూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి విడత యాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే అధికార పార్టీ వైఫల్యాలను, నేతల తీరుపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారాహి రెండో విడతలోనూ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫ్యలన్నీ ఎత్తి చూపుతూ ముందుకు సాగనున్నారని  సమాచారం.