Pawan Kalyan: దామోదరం సంజీవయ్య సీఎంగా ఉంది రెండేళ్లే.. ఎన్నో అభివృద్ధి పనులు ఆయన చలవేనన్న జనసేనాని

|

Oct 17, 2021 | 3:14 PM

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత  సీఎం  దామోదరం సంజీవయ్యను స్మరించుకున్నారు. ఆయన చిరస్మరణీయులని..

Pawan Kalyan: దామోదరం సంజీవయ్య సీఎంగా ఉంది రెండేళ్లే.. ఎన్నో అభివృద్ధి పనులు ఆయన చలవేనన్న జనసేనాని
Damodaram Sanjeevaiah
Follow us on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత  సీఎం  దామోదరం సంజీవయ్యను స్మరించుకున్నారు. ఆయన చిరస్మరణీయులని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోడానిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దుకు రూ.కోటి నిధిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దామోదరం సంజీవయ్య సేవలకు గుర్తు చేసుకుంటూ.. నిరుపేద కుటుంబం నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎదిగిన తొలి అణగారిన నేత దామోదరం సంజీవయ్య .. గొప్ప వ్యక్తి అంటూ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు దామోదరం ఇంటి ఫొటోలను పవన్‌ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

సీఎంగా ఉన్నది రెండు ఏళ్ళు.. అయినప్పటికీ ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారని.. వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు బీజాలు వేశారని పవన్ చెప్పారు. హైదరాబాద్‌ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారన్నారు.హైదరాబాద్–సికింద్రాబాద్ ను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు వంటివి చేసింది సంజీవయ్యేనన్నారు.

శ్రీకాకుళంలోని వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు ప్రాజెక్టులు ఆయన చలవేనన్నారు. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టుకూ అంకురార్పణ చేసిందీ ఆయనేనని గుర్తు చేశారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యేనని చెప్పారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని పవన్‌ గుర్తు చేశారు.

 

Also Read:

Road Accident: ప్రైవేటు బస్సు వేగంగా ఢీకొట్టిన ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం