Pawan Kalyan: యువత సమస్యలే ఎజెండాగా రణస్థలంలో యువశక్తి బహిరంగ సభ.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ పిలుపు
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో 'యువశక్తి ' పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను పవన్ కల్యాణ్ సోమవారం ఆవిష్కరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమర శంఖారావాన్ని ముందే పూరించినట్లు ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పని తీరుని ప్రశ్నిస్తూ.. జనసేనాని ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ యువతని ఆకట్టుకునే విధంగా మరో కార్యక్రమంతో ప్రజల ముందుకు రానున్నాడు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి ‘ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను పవన్ కల్యాణ్ సోమవారం ఆవిష్కరించారు.
ఏపీలోని యువత తమ గళం వినిపించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జనసేనాని చెప్పారు. రణస్థలం వేదికగా ఏర్పాటు చేస్తున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోందన్నారు. ఈ సభకు యువతీయువకులు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.
యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉండనుందని.. ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను యువత వినిపించవచ్చు అని తెలిపారు. మన యువత మన భవిత అని భావించి యువశక్తి సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు పవన్ కళ్యాణ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..