Pawan Kalyan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. వెయ్యి కోట్ల ఆఫర్‌పై స్పందించిన పవన్‌

|

Mar 14, 2023 | 11:03 PM

తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ 10వ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది. సభలో జనసేనవ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు..

Pawan Kalyan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. వెయ్యి కోట్ల ఆఫర్‌పై స్పందించిన పవన్‌
Pawan Kalyan Janasena
Follow us on

తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ 10వ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది. సభలో జనసేనవ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు రూ. వెయ్యి కోట్లు ఇస్తారన్న ప్రచారంపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా.. నాకు రూ.10 వేల కోట్లు ఇస్తారంటే వినడానికి బాగుండేది. నేను డబ్బుతో మిమ్మల్ని, మీ ఓట్లను కొనగలనా? సినిమాల్లో నటుడిగా నాకు రోజుకు రూ.2 కోట్లు ఇస్తారు. 20-25 రోజులు చేస్తే దాదాపు 45 కోట్ల వరకు వస్తాయి. నాకు డబ్బుపై వ్యామోహం లేదు. నేను చూడని సుఖాలులేవు అంటూ అన్నారు.

అణగారిన కులాలు ఎదగడానికి అండగా ఉంటానని, ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని అన్నారు. అసమానతలు లేని సమాజం కావాలి. అగ్రకులాల్లో ఉన్న పేదల గురించి అందరు ఆలోచించాలని కోరారు. ఈ దేశం అన్యాయం చేస్తోందని అగ్రకుల పేదల కడుపు మండుతోందన్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్రవర్ణ పేదలు అండగా ఉంటే కుల, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటానని తెలిపారు.

నాకు వంగవీటి రంగ అంటే చిన్నప్పటి నుంచి గౌరవం

నాకు వంగవీటి రంగ అంటే చిన్నప్పటి నుంచి గౌరవమని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. మా ఇంట్లో చిన్నప్పుడు వంగవీటి రంగాకు టీ ఇచ్చాను. చంపేస్తుంటే ఆయనకు మీరు అండగా ఎందుకు ఉండలేదు. చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. 2050కి కూడా కులం గోలతో కట్టుకుంటామా..? నన్ను కాపు నాయకులు తిడుతారు.. రెడ్డి వర్గం సీఎంను పొగుడుతారు. అన్ని కులాల్లో వెనుకబాటును పోగొట్టడమే జనసేన లక్ష్యమన్నారు. నిజంగా సీఎం మహానుభావుడు అయితే నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా. యువత కులాల ఉచ్చులో పడకూడదని ఆయన అన్నారు. భాష, యాసలను గౌరవించడం జనసేన విధానమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి