Pawan Kalyan: చంద్రబాబు కేబినేట్‌లోకి పవన్.! పదవి, శాఖలపై క్లారిటీ.?

|

Jun 10, 2024 | 12:31 PM

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఈ నెల 12న కేసరపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపైనా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

Pawan Kalyan: చంద్రబాబు కేబినేట్‌లోకి పవన్.! పదవి, శాఖలపై క్లారిటీ.?
Pawan Kalyan
Follow us on

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఈ నెల 12న కేసరపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపైనా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ పదవి, శాఖలపై ఇటీవల ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై టీడీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

ఒకవైపు చేతిలో పలు సినిమాలు.. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలతో.. పవన్ కళ్యాణ్ కొత్తగా కొలువుదీరే మంత్రివర్గంలో చేరాలా.? వద్దా.? అనే డైలమాలో ఉన్నారు. అయితే తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ చానెల్ స్క్రోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రి పదవిని జనసేనాని ఆశిస్తున్నట్టు వచ్చింది.

ఇది చదవండి: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..

మరోవైపు పవన్ కళ్యాణ్‌కు దాదాపుగా డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్టు టీడీపీ రాజకీయ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్‌కు కీలకమైన శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలో ఇరువురు నేతలిద్దరూ పదేపదే సార్లు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని.. అలాగే వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయితీలకు సరిగ్గా నిధులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. దీంతో హోంశాఖ, గ్రామీణాభివృద్ది శాఖలు పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు టీడీపీ, జనసేన వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కాగా, ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. టీడీపీ 135, బీజేపీ 8, జనసేన 21 గెలుచుకున్నాయి. ఇక ఎంపీ స్థానాల్లో టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 గెలిచాయి. అటు వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..