Janasena Party Formation Day Live: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జనసేనః పవన్ కళ్యాణ్

|

Mar 14, 2022 | 9:08 PM

Pawan Kalyan Speech in JSP Formation Day Live updates: జనసేన ఆవిర్భావ సభ.. ఇప్పటి వరకు జరిగిన సభలు వేరు. ఇది వేరు అంటున్నాయి జనసేన వర్గాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు.

Janasena Party Formation Day Live: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జనసేనః పవన్ కళ్యాణ్
janasena formation day

Jana Sena Party Formation Day: ఇది కేవలం ఆవిర్భావ సభ కాదు.! భవిష్యత్ ఆశల వారధి సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ.! ప్రజల ఇబ్బందులపై గళమెత్తుతాముంటున్నాయి జనసేనా సైన్యం..! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా..! సభా వేదిక నుంచే భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తా…! సభా వేదికగా ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తామంటోంది

ఇప్పటి వరకు జరిగిన సభలు వేరు. ఇది వేరు అంటున్నాయి జనసేన వర్గాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. భారీ జనసమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 12 కమిటీలను నియమించారు. అలాగే 11 వందలకుపైగా వాలంటీర్లతో కూడిన టీమ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.. సభావేదికకు దామోదరం సంజీవయ్యగారి పేరు పెట్టారు. ఎన్నికలకు టైమ్‌ దగ్గరపడుతున్న వేళ… ముందస్తు ముచ్చట్లు జోరుందుకున్న సమయాన.. పవన్ ఎలాంటి అంశాలు మాట్లాడుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏం ప్రకటించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. అటు సభా ప్రారంభానికి ముందే YCP Vs జనసేన అన్నట్లుగా మారిపోయింది సీన్. ఆవిర్భావ సభకోసం ప్రకాశం బ్యారేజ్‌ వారథిపై కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించడంపై నాదెండ్ల మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎలాంటి ఆటంకాలు కలగించకుండా సహకరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు…అటు ప్రభుత్వ తీరుని నిరసిస్తూ జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

తొమ్మిదేళ్ల కింద ఆవిర్భవించిన ఆ జనసేన పార్టీ.. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అది కూడా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Mar 2022 08:29 PM (IST)

    నాపై మానసిక అత్యాచారం చేశారుః పవన్ కళ్యాణ్

    • ప్రభుత్వం తీరును నిలదీస్తే దాడులకు తెగబడుతున్నారని జనసేనా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలను వేధిస్తే బీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ తప్పదన్నారు.
    • కులాల పేరుతో విభజించాలని చూస్తే ఊరుకునేదీలేదన్నారు.
    • వైసీపీని అధికారం నుంచి దించేంత వరకు శ్రమిస్తామన్నారు.
    • ఎన్నికలు వచ్చినాకనే పార్టీ పొత్తులకు గురించి ఆలోచిస్తాం.
    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుంది.
    • ఒక తరం కోసం యుద్ధం చేసేందుకు సిద్ధం.
    • దోపిడీ చేసే వైసీపీ గుండాలను జనసైన్యం అడ్డుకు
  • 14 Mar 2022 07:05 PM (IST)

    పవన్ కళ్యాణ్ ప్రసంగం ముఖ్యాంశాలు

    • జై ఆంధ్రా, జైతెలంగాణ, జై భారత్ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.
    • ఇప్పటం గ్రామానికి జనసేన ట్రస్ట్ ద్వారా రూ.50 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్.
    • అమరావతి-తాడేపల్లి మం- ఇప్పటం- లోని కొదమ సింహాలాంటి కార్యకర్తలు, వీరబొబ్బిలిలాంటి మహిళలకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న వారికి, పొలంలో వేదిక ఇచ్చిన రైతు సోదరులకు దన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్.
    • రాజకీయా పట్ల దేశ భక్తి పట్ల నాకు అవగాహన కల్పించింది నాగబాబు.
    • నాగబాబు లా కాలేజీలో చదువుకున్న సమయంలో నాకు నాగబాబు ఇచ్చిన పుస్తకం ఎంతో ప్రేరణ కల్పించింది.
    • పార్టీ పెట్టినప్పటి నుంచి 2008 నుంచి వెన్నంటే ఉన్న హనీఫ్, శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, సంపత్ సేవలు మరువలేనివి.
    • సమాజంలో మగవారు వీరత్వం ప్రదర్శించాలి. లేదంటే ఆడవారే బుద్ధి చెప్పాలి
    • తెలంగాణ ఉద్యమ స్పూర్తితో,  స్వాతంత్ర ఉద్యమం స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను.
    • అలయ్ బలయ్ పేరుతో..  అందరం దగ్గర కావల్సిన అవసరం ఉంది.
    • రాజకీయాల్లో వ్యక్తిగత విబేధాలు ఉండకూడదు.
    • బండారు దత్తాత్రేయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
    • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన  కేటీఆర్, చంద్రబాబుతో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలకు నమస్కారాలు చెప్పిన పవన్ కళ్యాణ్.4
    • అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.
    • నమస్కారాల పర్వం పూర్తి అయ్యింది.
    • నమస్కారాల సంస్కారం జనసేన సంస్కృతి.
    • పార్టీ నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలి
    • ఆరుగురితో మొదలైన పార్టీ రెండు రాష్ట్రాల్లో విస్తరించింది.
    • 126 మంది క్రియాశీలక మంది కార్యకర్తలతో ప్రారంభమై 5 లక్షల కార్యకర్తలకు ఎదిగాం.
    • 26శాతం ఓటు శాతానికి జనసేన పార్టీ పెరిగింది.
    • 1200 మందికి పైగా సర్పంచులను గెలిపించుకున్నాం.
    • స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాం.
    • పార్టీ సభ్యత్వం 46లక్షలకు చేరుకుంది.
    • వైసీపీ కు ఒక రూపమే కాంగ్రెస్.
    • ఎంత సింధూ అయిన బిందువుతో మొదలవుతోంది.
    • 7 నుంచి 27 శాతం .. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా జనసేన ఎదగబోతోంది.
    • నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తిత్వం బయటపడుతుంది.
    • అపజయాలను కూడా సమానం స్వీకరించారు.
    • నాయకులు అవరోధాలను పైతం సమర్థవంతంగా ఎదుర్కోవాలి.
    • ఇచ్చిన మాటను నిలబెట్టుకున్పప్పుడే నాయకుడవుతాడు.
    • హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యత గురించి కూడా నాయకుడు గుర్తించాలి.
    • మనం చేసే ప్రతి సభ్య సమాజానికి ఉయోగపడేలా ఉండాలి.
    • ఏపీ రాష్ట్రం బాగుండాలంటే జనసైనికుల చేతుల్లో ఉంది.
    • చీకట్లోకి వెళ్తున్న రాష్ట్రాన్ని కాపాడుకుందాం.
    • దేశం రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ఒక మార్పు చోటుచేసుకుంది.
    • జనసైన్యం లేకుంటే పవన్ కళ్యాణ్ లేడు.. జనసేనా పార్టీ లేదు.
    • ఎంతసేపు ప్రశ్నించే పార్టీ ఉంటాం.. అంటే తేలికగా తీసుకోవద్దు.
    • ప్రశ్నించడం అంటే పోరాటం చేయాలి..
    • బలమైన రాజ్యస్థాపనుకు వీర సైనికుల్లా పోరాలి.
    • మీ ప్రాణానికి ప్రాణం అడ్డు వేస్తాం.. పణ్ణంగా పెట్టం.
    • 2024వరకు గట్టిగా నిలదొక్కుంటాం.
    • స్వకార్యం కాదు.. ప్రజా కార్యం.. రామరాజ్యం సాధించుకుందాం.
    • రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజల
    • మంత్రి అవంతిని బంతితో, మంత్రి వెల్లంపల్లిని వెల్లుల్లిపాయతో పోల్చిన పవన్.
    • జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తారని అశించాం.
    • వైసీపీ నాయకులు, మంత్రులు అంటే కోపం లేదు.
    • పాలసీపైనే విబేధాలు తప్ప వ్యక్తిగతంగా దాడి చేయను.
    • రాష్ట్రం సుభిక్షంగా , ప్రజలు సఖఃసంతోషాలతో ఉంటారని అశించాను.
    • వైసీపీ సర్కార్ అశుభం, కూల్చివేతలతో మొదలు పెట్టారు. 
    • మూడు నెలలకే ఇసుక పాలసీతో.. 3లక్షల భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. 
    • 32 మంది కార్మికులను బలిగొన్నది వైసీపీ.
    • రాష్ట్రంలో విధ్వంసపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి.
    • ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టారు.
    • గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు.
    • వైసీపీ రాజ్యాంగ స్పూర్తిని విస్మరించి పాలన కొనసాగిస్తోంది.
    • వైసీపీ సర్కార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్ కళ్యాణ్.
    • సమాజం పట్ల ప్రేముంటేనే రాజకీయాల్లోకి వస్తారు
      భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు అంటూ చేయాల్సిన ప్రతిజ్ఞక వక్రభాస్యం చెప్పారు పవన్.
    • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు..
    • ముఖ్యమంత్రి మారితే పాలసీలు మారవు.
    • అమరావతి రాజధాని కోసం ప్రతిపక్షంలో ఉంటూ ఒప్పుకుని అధికారంలోకి రాగానే మాట తప్పారు వైఎస్ జగన్.
    • ప్రతిపక్షంలో వైసీపీ గాడిదలు కాసారా.. 
    • రూ.3000 కోట్లు ఖర్చు పెట్టాక రాజధాని మారుస్తామంటే కుదరదు.
    • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండి తీరుతుంది.
    • అమరావతి రాజధాని రైతులపై పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నాపై పడ్డట్టే.
    • న్యాయవ్యవస్థను కూడా వైసీపీ సర్కార్ తప్పుబడుతోంది.
    • వ్యవస్థను తిట్టే హక్కు నాయకులకు లేదు.
    • వ్యక్తులపై దాడికి వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. 
    • హైకోర్టును తప్పుబట్టే హక్కు వైసీపీ నేతలకు లేదు.
    • వ్యక్తిగత దుషణలకు, దుర్భాషణలకు పాల్పడుతున్నారు.
    • పోలీసు వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టిస్తోంది.
    • ఐఏఎస్, ఏపీఎస్ అధికారులను అవగాహనలేని మంత్రులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
    • పోలీసులకు జీతాలతో పాటు కరువు భత్యం ఇవ్వడంలేదు.
    • పోలీసుల శ్రమను వైసీపీ సర్కార్ దోచుకుంటోంది.
    • చిత్తూరులో ఓ సీఐను వైసీపీ నేతలు చొక్కా పట్టుకుని బెదిరించారు. 
    • అధికార పార్టీకి భయపడుతూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
    • వైసీపీ నేతలను ఎదురించిన పోలీసులను వేధింపులకు గురిచేస్తున్నారు. 
    • సీపీఎస్ స్కీం విషయంలో ఉద్యోగులకు మొండి చూపింది వైసీపీ.
    • పార్టీ రంగుల కోసం రూ.3000 కోట్లు, ప్రకటనల కోసం రూ.400 కోట్లు ఖర్చు చేశారు.
    • వేతన సవరణ పేరుతో ఉద్యోగుల జీతాలను తగ్గించింది వైసీపీ సర్కార్.
    • తెలంగాణ కంటే ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.
    • రోడ్డు రహదారులు సరిగా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.
    • 10 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగి 850మంది ప్రాణాలను కోల్పోయారు.
    • ఆదాయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేయడంలో విఫలమైంది.
    • ఫించన్లు, అమ్మ ఒడికి నిధులు నిలిచిపోయాయి.
    • రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు వెనక్కు తగ్గుతున్నాయి.
    • ఉన్న కంపెనీలే రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయి.  
    • పెట్టుబడుతు రాకుంటే ఉపాథి అవకాశాలు రాకుండాపోతాయి.
    • ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ నిధులు పక్కదారి పడుతున్నాయి.
    • మద్య నిషేధం పేరుతో కొత్త దుకాణాలు తెరిచి ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతోంది వైసీపీ.
    • 25వేల కోట్లు మద్యం ఆదాయం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తోంది.
    • అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దోచేసుకుంటున్నారు.
    • తిరుపతిని కూడా ఆదాయ మార్గంగా చూస్తున్నారు.
    • విగ్రహాలను ధ్వంసం చేస్తే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.
    • మజీదు, చర్చిలపై లేని ప్రభుత్వ నియంత్రణ హిందూ దేవాలయలపై ఎందుకు అని ప్రశ్నించారు.
    • సంపన్న ఆంధ్రప్రదేశ్ చేసేందుకు ప్రతి ఒక్క జన సైన్యం కంకణం కట్టుకోవాలి.
    • నూతన పారిశ్రామిక పాలసీ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేద్ధాం..
    • అమరావతి రాజధానితో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తాం.
    • యువత అర్థిక స్వాలంభన సాధించాలి.
    • యువత స్వయం ఉపాధి సాధించుకునేందుకు ఆర్థిక సాయం. 
    • ప్రతి యువతకు రూ.10లక్ష ఆర్థిక సాయం చేస్తాం.
    • వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం.
    • రైతుకు మద్దతు ధరలు ఇప్పించేందుకు కృషీ చేస్తాం
    • ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తి చేస్తాం
    • సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నా.
    • కులాల ఐక్యతే జనసేన లక్ష్యం.

     

  • 14 Mar 2022 06:47 PM (IST)

    సంక్షేమం పేరుతో వైసీపీ విలువలు లేని రాజకీయంః నాదెండ్ల

    • రాష్ట్రంలో మంత్రులు, వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు.
    • సంక్షేమం పేరుతో విలువలు లేని రాజకీయం చేస్తోంది అధికార పార్టీ.
    • బహిరంగ సభ ఏర్పాటు కోసం అడుగడుగునా అవాంతరాలు సృష్ఠించారు.
    • సభ ఏర్పాటుకు సహకరించిన రైతులకు ప్రత్యేక దన్యవాదాలు.
    • అమరావతి రైతులను, ప్రజలను వైఎస్ జగన్ మోసం చేశారు.
    • అర్హులైనవారికి సంక్షేమం పథకాలు అందించడంలో జగన్ సర్కార్ విఫలమైంది.
    • మత్స్యకారులకు అభ్యున్నతికి వారికి భరోసా కల్పించేందుకు జనసేన ప్రయత్నిస్తోంది.
    • సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోంది.
    • జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలి.
    • మూడేళ్లలో జనసేన పార్టీ రాష్ట్రంలో భారీ విస్తరించింది.
    • రేపటి రోజున ప్రతి క్రియాశీలక కార్యకర్తకు పార్టీ గుర్తింపు ఉంటుంది.
    • జాబ్ గ్యారెంటీ పేరుతో వైసీపీ సర్కార్ మోసం చేసింది.
    • ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన సాగుతోంది.
    • కరోనా వల్ల నష్టపోయిన యువతను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
    • పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగం పెరగుతోంది.
    • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు భయపడుతున్నాయి.
    • పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో నిలబడాలి.
    • ఆత్మ గౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం.
    • పార్టీలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుంది.
    • సోషల్ మీడియాలో పార్టీతో పాటు పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న దుష్పచారాన్ని తిప్పుకొట్టాలి.
    • రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారు ముఖ్యమంత్రి జగన్.
  • 14 Mar 2022 06:44 PM (IST)

    తెలుగు వారి భయాందోళనలు పోగొట్టేందుకు జనసేనః నాదెండ్ల

    రాష్ట్ర భవిష్యత్ కోసం.. యువతలో ఉన్న భయం పోగొట్టేందుకు విభజన అనంతరం తెలుగువారిని ఆదుకునేందుకు జనసేన అవిర్భావం ఏర్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

    Nadendla

     

  • 14 Mar 2022 06:29 PM (IST)

    రాజకీయాల్లో దొంగలు పడ్డారుః నాగబాబు

    రాజకీయాల్లో దొంగలు పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు.  సాధారణ దొంగలు ప్రజల ఆస్తులను దోచుకుంటారు. ప్రజల అభివృద్ధిని, ప్రజల శ్రమను దోచుకుంటారని నాగబాబు మండిపడ్డారు. దొంగలు రెండు రకాలుగా ఉంటారని నాగబాబు అన్నారు.  రాజకీయ దొంగలను మనమే ఎన్నుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    • రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత సీఎం జగన్ దే
    • నా అనుభవంలో మంచి, చెడ్డ సీఎంను చూశానని, కానీ దుర్మార్గ సీఎం జగన్‌రెడ్డే
    • రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది
    • మంత్రులకు శాఖలు కూడా గుర్తు రావడంలేదు
    • చేసేదీ పనిలేక, సరదా సంభాషణలతో మంత్రులు కాలం వెళ్లదీస్తున్నారు.
    • రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
    • రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక… అప్పులు, ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయి.
    • రాష్ట్రంలో ప్రతి పౌరుడిది మీద రూ.లక్ష అప్పు ఉంది.
    • తలబడాలంటే, నిలబడాలంటే వెన్నుముక కావాలి.. ప్రజల నాయకుడై పవన్ వస్తున్నాడు.
    • ప్రజలకు అద్భుత పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఉంది
    • మరోసారి జగన్‌ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా ఇతరరాష్ట్రాలకు పోవాలని చూస్తున్నారు.
  • 14 Mar 2022 06:25 PM (IST)

    సభ ప్రాంగణానికి సేనసేనాని

    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతోంది. ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన ఈ సభను ఏర్పాటుచేసింది. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. సభ ప్రాంగణానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.

    Pawan Kalyan

  • 14 Mar 2022 06:21 PM (IST)

    సభకు రాకయ్య రాపాక.. అంటూ పోస్టర్లు

    జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఆవరణలో కొన్ని పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్‌ గెలుపొందారు. రాష్ట్రంలో జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనొక్కరే. ఎన్నికలు పూర్తయిన కొద్దిరోజులకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

    Jasena Sabha

  • 14 Mar 2022 06:15 PM (IST)

    కార్యకర్తలు పులిహోర

    సభకు హాజరైన కార్యకర్తలకు, ప్రజలకు రెండు టన్నుల(2000కేజీ )పులిహోర సిద్ధం చేశారు. మూడు లక్షల మజ్జిగ ప్యాకేట్స్, నాలుగు లక్షల వాటర్ ప్యాకేట్స్, మహిళల కోసం 10వేల సీట్లు కేటాయించారు.

    6

     

  • 14 Mar 2022 06:11 PM (IST)

    20ఎకరాల స్థలంలో బహిరంగ సభ

    జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండదని.. బహిరంగ సభకు 20ఎకరాలు ఇవ్వడమే కాకుండా.. పార్కింగ్ కు 50 ఎకరాలు ఇచ్చి మంచి మనసును చాటుకున్నారు.

    5

  • 14 Mar 2022 06:04 PM (IST)

    మరికాసేపట్లో సభావేదికకు పవన్

    తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కొనసాగుతోంది. సభకు జనసైనికులతో పాటు ప్రజలు భారీగా వచ్చారు. మద్యాహ్నం నుంచి రాత్రి 7:30 వరకు సభ జరనుంది. ఈ సభకు అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరవుతున్నారు. మరికాసేపట్లో పవన్ ప్రసంగిస్తారు. సభలో పార్టీ కార్యకర్తలకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేస్తారు.

  • 14 Mar 2022 05:56 PM (IST)

    రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికి ఆహ్వానం

    జనసేన అవిర్భావ సభకు తరలివచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా సభకు ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని ఆ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • 14 Mar 2022 05:50 PM (IST)

    ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ అంకితం

    కరోనా వేళ జన సైనికుల సేవా కార్యక్రమాలు అపూర్వమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కోవిడ్ వల్ల చనిపోయినవారికి సభా వేదిక పైనుంచి సంతాపం తెలియజేశారు. ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు.

    Nadendla Manohar 1

  • 14 Mar 2022 05:50 PM (IST)

    రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా రాజ్యంః హరిప్రసాద్

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే ఉందని ఆ పార్టీ నేత హరిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించడంతో పవన్ వల్లే సాధ్యమని అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు జనసేన కృషి చేస్తోందన్నారు.

  • 14 Mar 2022 05:34 PM (IST)

    హాజరైన నాగబాబు

    నేటితో జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుడుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు హాజరయ్యారు.

    4

  • 14 Mar 2022 05:33 PM (IST)

    జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం

    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్బావ సభ ప్రాగంణానికి భారీగా జన సైనికులు తరలివచ్చారు. భారీగా హాజరైన జన సైనికులు సభా ప్రాంగణంలోకి చొచ్చుకు వచ్చారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

    3

  • 14 Mar 2022 05:31 PM (IST)

    9వ ఏట అడుగుడుపెడుతోన్న జనసేన

    నేటితో జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుడుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటు చేశారు.

  • 14 Mar 2022 05:27 PM (IST)

    రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్న నేతలు

    సభా వేదిక పైనుంచి ప్రసంగిస్తున్న జనసేన నేతలు.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయేది జనసేన ప్రభుత్వమేనని.. పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

    Nadendla Manohar

  • 14 Mar 2022 05:23 PM (IST)

    జనసంద్రంగా ఇప్పటం గ్రామం

    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్బావ సభ ప్రాగంణానికి భారీగా జన సైనికులు తరలివచ్చారు.

    2

  • 14 Mar 2022 05:12 PM (IST)

    పవన్‌ ప్రసంగంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి

    జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారని, అటు కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ సర్కార్‌పై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న పవన్‌.. ఇవాళ ఎలాంటి సంచలన ఆరోపణలు సంధిస్తారోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

  • 14 Mar 2022 05:12 PM (IST)

    జనసేన ఆవిర్భావ సభపై సర్వత్రా ఆసక్తి

    జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది రాష్ట్ర రాజకీయాల దశ, దిశను మార్చే సభ అని పవన్‌ కల్యాణ్ ప్రకటించడంతో రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ ఏర్పడింది. పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్‌ సంచలన కామెంట్లు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • 14 Mar 2022 04:59 PM (IST)

    ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

    మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను, జనసేన కార్యకర్తలను ఉత్సహపరుస్తున్నాయి.

  • 14 Mar 2022 04:53 PM (IST)

    2024 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్

    2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ సభను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకు అనుగుణంగా జనసేన నాయకులు భారీ ఏర్పాటు చేశారు.

  • 14 Mar 2022 04:52 PM (IST)

    భారీ ఏర్పాట్లు చేసిన జనసేన నేతలు

    2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ సభను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకు అనుగుణంగా జనసేన నాయకులు భారీ ఏర్పాటు చేశారు.

  • 14 Mar 2022 04:51 PM (IST)

    మంగళగిరిలో భారీ బహిరంగ సభ

    జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఇవాళ(సోమవారం) మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

Follow us on