Pawan Kalyan: అమిత్ షాతో భేటీ అనంతరం కీలక ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్

|

Jul 19, 2023 | 9:51 PM

ఏపీలో మళ్లీ పొత్తులపై రచ్చ మొదలైంది. NDA సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌..2014 నాటి పొత్తులే రిపీట్‌ అవుతాయంటూ చేసిన ప్రకటన ఏపీలో పొలిటికల్‌ హీట్‌ రేపుతోంది. అటు మేం చెప్పిందే కరెక్టయిందని వైసీపీ ఎటాక్‌ మొదలుపెట్టింది.

Pawan Kalyan: అమిత్ షాతో భేటీ అనంతరం కీలక ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
Pawan Kalyan -Amit Shah
Follow us on

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇద్దరి భేటీ దాదాపు 15 నిమిషాలపాటు జరిగింది. సమావేశం తర్వాత పవన్ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. అమిత్‌షాతో సమావేశం అద్భుతంగా జరిగిందన్నారు పవన్. అర్థవంతంగా, నిర్ణయాత్మకంగా, ఏపీ ప్రజల భవిష్యత్‌కు మేలు జరిగేలా చర్చలు సాగాయన్నారు. ఈ మీటింగ్‌లో నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌ అనగానే.. పొత్తులు, రోడ్‌మ్యాప్ అంశమే తెరపైకి వచ్చింది. ఉదయం ఏపీ ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌ను కలిసారు పవన్. రాత్రికి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడలేదు. హైదరాబాద్‌ తిరిగి వచ్చాక AP బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరని కలుస్తారా.. యాక్షన్ ప్లాన్‌ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన అభిమతమని, ఎన్డీఏలోకి కొత్త పార్టీలు ఎంట్రీ ఇవ్వొచ్చని పొత్తులపై మంగళవారం రాత్రి ఢిల్లీలోనే సాలిడ్ హింట్ ఇచ్చేశారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్న ఆయన కామెంట్‌ని అన్ని పార్టీలూ అండర్‌లైన్ చేసుకున్నాయి. ఆల్రెడీ బీజేపీతో దోస్తీలో ఉన్న పవన్‌.. తమ రింగులోకి తెలుగుదేశం పార్టీని కూడా వస్తే బెటర్‌గా ఉంటుందని మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు తెలుగుదేశం-బీజేపీ మధ్య దూరం తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. తాజా ఢిల్లీ టూర్‌లో కమలం పార్టీ పెద్దలతో మంతనాల ద్వారా కొంత క్లారిటీ తీసుకురాబోతున్నారు పవన్. జనసేన అధ్యక్షుడి వెర్షన్ తీసుకున్నారు కనుక… ఆ తర్వాత ఏపీ బీజేపీ లీడర్లను పిలిపించుకుని తుదినిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.

రెండుమూడురోజుల్లో పవన్‌తో భేటీ అవుతామన్న పురంధేశ్వరి వ్యాఖ్యల వెనుక అంతరార్థమేంటి.. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక పవన్ వైఖరి ఎలా ఉండబోతోంది… గురువారం మంగళగిరి ఆఫీసులో చేరికల సందర్భంగా ఏదైనా సూచనప్రాయ ప్రకటన చేస్తారా అనే చర్చ నడుస్తోంది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..