విశాఖ, ఆగస్టు 9: ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే బాగానే ఉటుంది.. అదే ట్రైన్ వేగంగా దూసుకుపోతుంటే చూస్తే భయమేస్తుంది. అదే ఢీ కొడితే.. ఇంకేమైనా ఉందా.. నుజ్జు నుజ్జే.. అందులో ఉన్నటువంటివారి సంగతి ఇక చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఘటనే ఒకటి విశాఖలో జరిగింది. షీలా నగర్ పోర్ట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఓ కారు తుక్కు తుక్కయ్యింది. సుజుకి బెలునో కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్నవారికి ఎవరికీ ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా షాక్ అయ్యారు. అక్కడ ఈ ప్రమాదాన్ని చూసినవారు భయంతో వణికిపోయారు.
లూప్ లైన్‌ను క్రాస్ చేసే క్రమంలోట్రాక్ మధ్యలో కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది గమనించిన లోకో పైలట్ రైలును బాగా స్లో చేశాడు. ట్రైన్‌ను గమనించి వెంటనే కారు డోర్లు తెరచి బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రయాణికులు ప్రాణాలతో భయట పడ్డారు. ఇది ఒక గ్రేట్ ఎస్కేప్ అని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆ దృశ్యాలు చూసినవారు భయంతో వణికిపోయారు. కార్ నుజ్జు నుజ్జు అయింది. ఆ దృశ్యాలు చూస్తే అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఎవరూ బతికే ఛాన్స్ లేదని అంతా ఫిక్స్ అయ్యారు.
కానీ అందులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం.. అతి స్వల్ప గాయాలతో బయటపడ్డ మిరాకిల్ అంటున్నారు.. విశాఖ లోని షీలా నగర్ పోర్ట్ రోడ్డు మారుతి సర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక సుజుకి బెలేనో కారును గూడ్స్ ట్రైన్ డీ కొంది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో భయటపడ్డారు. పోర్ట్ నుంచి స్థానిక వేర్ హౌజ్‌లకు వెళ్ళే రైల్వే లూప్ లైన్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శ్రీహరి పురం నుంచి విశాఖ సిటీ కి వచ్చే క్రమంలో ఉన్న రైల్వే లైన్ ను క్రాస్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రాస్ చేసే ప్రయత్నంలో ట్రాక్ మధ్యలో కారు ఆగిపోయింది. ఇది గమనించిన లోకో పైలట్ రైలును బాగా స్లో చేశారు. అదే సమయంలో ట్రైన్ ను గమనించిన ప్రయాణీకులు వెంటనే కారు డోరు తీసుకుని బయటకు దూకడంతో ప్రాణాలతో భయటపడ్డారు.
ఈ కారు ప్రమాదంలో భయట పడింది రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబంగా గుర్తించారు. కానీ వివరాలు ఇచ్చేందుకు ఇష్టపడని వాళ్ళు, తమ వివరాలు చెప్పొద్దంటూ విజ్ఞప్తి చేశారనీ పోలీసులు చెబుతున్నారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ పోర్టుకు వచ్చే అనేక రకాల ముడి సరుకులని లేదా ఉత్పత్తులని నిల్వ చేసేందుకు సమీపంలోనే ప్రైవేట్ వేర్ హౌజ్ లు ఉంటాయి. ఇతర దేశాల నుంచి పోర్టుకు చేరుకున్న సరుకుని ఈ వేరు హౌసుల్లో నిల్వ ఉంచి ఆర్డర్స్ మేరకు ఇక్కడి నుంచి సప్లై చేసే వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అందుకనే పోర్టు నుంచి రైల్వే లైన్లు నేరుగా ఆ వేరు హౌసులకి ఉంటాయి.
ప్రైవేట్ వేరే హౌస్ లు కాబట్టి సాధారణంగా అక్కడికి ఆయా కంపెనీల వాహనాలు తప్ప ప్రయాణికుల వాహనాలు అనుమతించరు. అదే సమయంలో ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి రైల్వే క్రాసింగ్ లైన్స్ కూడా ఉండవు. ఈ నేపథ్యంలో షార్ట్ కట్ కావడంతో ఈ మార్గాన్ని ఆ రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబం ఎంచుకుని ఉంటుందని, ఆ సమయంలోనే ట్రైన్ రావడంతో ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం