Covid-19: బెజవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం.. వైద్యులు సహా 50 మంది సిబ్బందికి పాజిటివ్..

|

Jan 18, 2022 | 12:07 PM

Vijayawada Government Hospital: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సాధారణ ప్రజలతోపాటు.. పలువురు నాయకులు

Covid-19: బెజవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం.. వైద్యులు సహా 50 మంది సిబ్బందికి పాజిటివ్..
Doctors
Follow us on

Vijayawada Government Hospital: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సాధారణ ప్రజలతోపాటు.. పలువురు నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. వారికి వైద్యం అందించే డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ ప్రారంభమైన అనంతరం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడ (Vijayawada) ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది. ఆసుపత్రిలోని మొత్తం 50 మంది వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి కరోనా (Covid-19) సోకినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఆసుపత్రి (Government Hospital) లో పెద్ద ఎత్తున వైద్యులకు, సిబ్బందికి కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

కాగా.. ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం (24 గంటల్లో) సాయంత్రం వరకు 22,882 శాంపిల్స్ ని పరీక్షించగా 4,108 మందికి కోవిడ్19 పాజిటివ్ అని తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2110388కి చేరింది. ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఎవరూ కూడా కరోనాతో చనిపోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14510గా ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 30182 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 696 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2065696కి చేరింది.

Also Read: Andhra Pradesh: నెల్లూరులో చిన్నారి అపహరణ.. గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు..

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోలుదారులకు షాకింగ్‌.. లబోదిబోమంటున్న కస్టమర్లు