
కర్నూలు జిల్లా బెళగల్ మండల పరిధిలోని సంగాల గ్రామానికి చెందిన శంకరన్న పొలంలో చిట్టి ముత్యాలు వేయగా మంచి దిగుబడి వచ్చింది. అరెకరం పొలంలో 6 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి సాధించారు. సేంద్రియ వ్యవసాయ సాగు(సీఎస్ఏ) పద్ధతిలో చిట్టిముత్యాలు వరి రకం సాగు చేశారు. అరెకరం పొలంలో నాటు వేశారు. ఇందుకు రూ.1200 వెచ్చించారు. విత్తనశుద్ధి చేసి పొలంలో విత్తారు. వేప పిండి 100 కిలోలు వేశారు. సేంద్రియ ఎరువులతో పాటు పంట సాగుకు రూ.4 వేల వరకు ఖర్చు చేశారు. పంట కాలం 90 రోజులు. ఇటీవల సీఎస్ఏ అధికారులు.. పంటకోత చేసిన తర్వాత వెళ్లి చూసి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు చెప్పారు. ఈ రకం ధాన్యానికి ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.6500 నుంచి రూ.7500 వరకు ధర పలుకుతోంది. ఆరు క్వింటాళ్ల దిగుబడికి క్వింటా రూ.6500 చొప్పున రూ. 39 వేలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి రూ.4 వేలు పోను రూ. 35 వేల నికర లాభం వస్తుందని రైతు శంకరన్న పేర్కొన్నారు.
కొత్తకోటలో రైతులు ఉపేంద్ర, శివరామిరెడ్డిలు ఎకరా పొలంలో చిట్టిముత్యాలు సాగు చేశారు.కృత్రిమ వ్యవసాయం ద్వారా సాగు చేయడంతో పెట్టుబడి తగ్గి,దిగుబడి పెరిగి, ఆర్గానిక్ కావడంతో డిమాండ్ కూడా పెరిగింది. సోనా మసూరి బియ్యానికి ఉమ్మడి కర్నూలు జిల్లా ఫేమస్. అలాంటి చోట చిట్టి ముత్యాలు బియ్యం సాగు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతూ లాభాలు ఆర్జిస్తున్నారు రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.