Andhra Pradesh: ఆన్‌లైన్‌లో ప్రేమ.. అడగ్గానే 3 లక్షలు ఇచ్చేసింది.. ఆపై అసలు మ్యాటర్ తీయగానే..

Andhra Pradesh: ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ ద్వారా పరిచయాలు, ఆపై పీకల్లోతు ప్రేమలో మునిగితేలడం.. చివరికి మోసపోవడం వంటి ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి.

Andhra Pradesh: ఆన్‌లైన్‌లో ప్రేమ.. అడగ్గానే 3 లక్షలు ఇచ్చేసింది.. ఆపై అసలు మ్యాటర్ తీయగానే..
Woman Protest

Updated on: Sep 13, 2021 | 9:54 AM

Andhra Pradesh: ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ ద్వారా పరిచయాలు, ఆపై పీకల్లోతు ప్రేమలో మునిగితేలడం.. చివరికి మోసపోవడం వంటి ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనేతాజాగా.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వెలుగు చూసింది. ఆన్‌లైన్ ప్రేమను నమ్మిన ఓ యువతి.. యువకుడికి సర్వం సమర్పించేసుకుంది. ఆపై యువకుడు ముఖం చాటేయడంతో తాను మోసపోయానని గ్రహించి బోరున విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది. ఈ ఆన్‌లైన్ ప్రేమ, మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న యువతికి, చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అబీద్‌ ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. నువ్వు లేకపోతే నేను లేనంటూ యువతికి మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కూడా.

అయితే, అతని మాయ మాటలు నమ్మిన యువతి.. అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఈ క్రమంలో అబీద్‌కు 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది. పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముఖం చాటేయడం ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా కొద్ది అబీద్.. సదరు యువతిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. రాను రాను మొత్తానికే కాంటాక్ట్ అవ్వడం మానేశాడు. పెళ్లి చేసుకోమంటే ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి.. నేరుగా యువకుడి ఇంటికి వచ్చింది. అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. బాధిత యువతికి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మద్ధుతుగా నిలిచాయి. కాగా, బాధిత యువతి అబీద్ చేసిన మోసంపై మదనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోటా సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..

Love Story: లవ్‌ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?? వీడియో

Kim Weight Loss: స్లిమ్‌గా మారిన కిమ్‌.. అసలు కిమ్‌కు ఏమైంది..? వీడియో