Ongole News: మరోసారి రచ్చకెక్కిన సుబ్బారావు గుప్తా.. ఒంగోలులో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

|

Mar 17, 2022 | 4:38 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) లో మరోసారి సుబ్బారావు గుప్తా వ్యవహారం బయటపడింది. గతంలో వైసీపీ నేత సుభాని చేతిలో దాడికి గురైన సుబ్బారావు గుప్తా వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి....

Ongole News: మరోసారి రచ్చకెక్కిన సుబ్బారావు గుప్తా.. ఒంగోలులో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
Ongole Subbarao
Follow us on

ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) లో మరోసారి సుబ్బారావు గుప్తా వ్యవహారం బయటపడింది. గతంలో వైసీపీ నేత సుభాని చేతిలో దాడికి గురైన సుబ్బారావు గుప్తా వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గుప్తా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం, వైసీపీ నేతలు (YCP Leaders) అరాచకాలకు పాల్పడుతున్నారని, సీఎం జగన్‌ మేలుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మున్సిపల్‌ సిబ్బంది ఆధీనంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేయాలంటూ కార్పొరేషన్‌ మేయర్‌తో గొడవ పడటంతో గుప్తాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది (case Filed). అయితే తనపై అక్రమ కేసులు పెట్టారని, కేసు ఉపసంహరించుకోవాలని మేయర్‌ సుజాతకు గుప్తా వార్నింగ్‌ ఇచ్చారు. త్వరలోనే అందరి జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం మరో రచ్చకు దారితీసేలా ఉంది. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆధీనంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేస్తామంటూ సుబ్బారావు గుప్తా మరి కొంతమందితో కలిసి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చారు. తాళం వేసి ఉన్న గదిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఉండటంతో తలుపులకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత ఛాంబర్లోకి దూసుకొచ్చి కులం పేరుతో దుర్భాషలాడారంటూ సుబ్బారావు గుప్తా , మరికొందరిపై మేయర్ సుజాత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేయర్ ఫిర్యాదుతో పోలీసులు సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సుబ్బారావు గుప్తాపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్‌ సుజాత కోరారు. మరోవైపు.. తనపై అక్రమంగా కేసు పెట్టారని సుబ్బారావు గుప్తా అన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ ఏడాది క్రితం విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న కార్పొరేషన్‌ అధికారులు విగ్రహాన్ని ఓ రూంలో ఉంచారని, ఆయన జయంతి సందర్బంగా విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వెళితే సిబ్బంది అనుమతించలేదంటున్నారన్నారు. ఈ విషయమై మేయర్‌ సుజాతను ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారని చెప్పారు. తనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గుప్తా హెచ్చరించారు.

గతంలో సుబ్బారావు గుప్తా ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బారావు గుప్తా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వారు మాట్లాడుతున్న భాష, వ్యవహారశైలి అభ్యంతరకరమని, ఫలితంగా పార్టీకి 20 శాతం వరకు ఓటింగ్‌ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వైసీపీ కార్యకర్తలను కర్రలతో తరిమి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూటుగా మద్యం తాగిన 15 మందికి పైగా వ్యక్తులు లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా నివాసానికి రాత్రి సమయంలో వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో లేరు. అయినప్పటికీ అతన్ని దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అంతుచూస్తామని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు.

Also Read

Balka Suman: బుల్డోజర్లు తెచ్చి తెలంగాణ ప్రజలను చంపుతారా?.. టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Kidney Stone: మీరు కిడ్నీ స్టోన్‌తో ఇబ్బంది పడుతుంటే.. ఈ విషయాలకు దూరంగా ఉండండి..

ACB raids: ఏసీబీ సోదాల్లో ప్రభుత్వాధికారుల అక్రమాస్తులు బట్టబయలు.. దొరికిన ఆస్తులు చూసి అందరూ షాక్..