AP Crime News: మంచి చెడులు అనేవి మనలోనే ఉంటాయని.. మంచి చేస్తే మంచే జరుగుతుందని, చెడు జరిగితే చెడే జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఎవరికీ ఏ హానీ కలిగించకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. గుప్త నిధుల తవ్వకాలకు వెళ్తున్న ముఠాలోని ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి (Electrical Shock) గురై మృతి చెందాడు. మంటలు చెలరేగి మరీ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అతనిలో వచ్చిన వాళ్లందరూ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు(Nellore) జిల్లా ఉదయగిరి (Udayagiri) మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య, కడప జిల్లా బద్వేలు, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, చెన్నైకి చెందిన ఒక పూజారి, గంగిరెడ్డిపల్లి గ్రామానికి మరో ఇద్దరు బృందంగా ఏర్పడ్డారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ సంచరిస్తుండేవారు. ఈ క్రమంలో సర్వరాబాదు సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం వెళ్లారు. కృష్ణయ్య ముందు నడుస్తున్నాడు. ఈ మార్గంలో అటవీ ప్రాంతంలో ఉన్న11 కేవీ విద్యుత్తు స్తంభాల నుంచి వన్యప్రాణుల కోసం బైండింగ్ తీగతో కంచె వేసి ఉంది. కృష్ణయ్య వీటికి గమనించలేదు. అలాగే ముందుకు వెళ్తుండగా కృష్ణయ్యకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురైన ముఠా సభ్యులు.. అక్కడి నుంచి పరారయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన కృష్ణయ్య తిరిగి రాకపోవడంతో సోమవారం అతని భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఠాలో సభ్యుడైన శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Also Read
Health Tips: పెళ్లయిన మగవారు కచ్చితంగా ఈ 3 ఆహారాలు తినాలి.. అప్పుడే పూర్తి ఫిట్‌గా ఉంటారు..!
Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేది మీ సీక్రెట్ చెప్పేస్తుంది!