జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూ. కోటి లను విరాళంగా అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో కోటి రూపాయల చెక్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కోశాధికారి ఎం.వి రత్నంలకు అందజేశారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికీ ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత రెండు ఏళ్లుగా ఏటా కోటి రూపాయల చొప్పున విరాళం అందజేస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది మూడో సారి తన వంతుగా కోటి రూపాయలను విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందలను తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్న నాయకులు , వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని జనసేనాని ఆకాంక్షించారు.
జనసైనికుల ప్రమాద బీమా నిధికి కోటి రూపాయలు అందించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.@PawanKalyan ?? @JanaSenaParty pic.twitter.com/kYIpXksPys
— Trend PSPK (@TrendPSPK) February 22, 2023
జనసేన పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడమే కాదు..వారికీ భీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ బీమాలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యులకు వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు.
ఎక్కడ ప్రమాదం చోటుచేసుకున్న వాయిదా ఖర్చులకు రూ.50 వేల వరకు బీమాను వర్తింపజేస్తారు. కార్యకర్తలకు బీమా విషయంలో ఎప్పుడు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయంలో టీమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటుగా జిలాల్లోను తగిన సమాచారం అందించి వారికి సహాయపడేలా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..