Omicron variant Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులో కలిపి ఏపీలో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు చేరాయి. తూర్పు గోదావరి కోనసీమ అయినవెల్లి మండలం నేదునూరిపాలెనికి చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఈ మహిళ కువైట్ నుంచి వచ్చింది. ఈ నెల 19న ఆమె విజయవాడ గన్నవరంలో దిగి కారులో నేదునూరిపాలేనికి వచ్చినట్లు వెల్లడించారు. దీంతో ఆమెను కాంటాక్ట్ అయిన కుటుంబసభ్యులుకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమెతోపాటు.. యూఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా.. అంతకుముందు కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది.
Also Read:
AP Theaters: ఏపీలో పలు థియేటర్స్ క్లోజ్.. స్వచ్ఛందంగా కొన్ని.. సీజ్ చేయడంతో కొన్ని..
Crime News: నల్లగొండలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆపై తండ్రి ఏం చేశాడంటే..?
Hyderabad Road Accident: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ దుర్మరణం