Baby Girl Rescue: అయ్యో.. ఎవరు కన్న బిడ్డో.. చెట్ల పొదల్లో వదిలేశారు..

|

Dec 28, 2021 | 7:07 PM

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఒంగోలు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు.

Baby Girl Rescue: అయ్యో.. ఎవరు కన్న బిడ్డో.. చెట్ల పొదల్లో వదిలేశారు..
Baby Girl Rescue
Follow us on

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఒంగోలు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఒంగోలు సమీపంలోని సర్వే రెడ్డి పాలెం కు వెళ్లే రహదారిలో ఒక్క రోజు పసిపాపను రాత్రి వేళలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. రాత్రంతా చలికి బిగుసుకుపోయి ఉన్న పాప చీమల బారినపడి ఒళ్లంతా రక్తం ఓడింది. చూసేందుకు భయానకంగా ఉన్న పాపను గుర్తించిన కొంతమంది యువకులు ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పాపను సంరక్షించారు. అక్కడికక్కడే ప్రాథమిక వైద్యం చేసి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పాపకు చికిత్స అందించి ప్రాణాపాయం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటనపై ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాప నిన్ననే పుట్టి ఉంటుందని అందుకు సంబంధించిన ఆసుపత్రి డెలివరీ రసీదు దొరికిందని అందులో పాప తల్లి పేరు ఉందని స్పష్టం చేశారు. డెలివరీ రసీదు ఆధారంగా వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

పుట్టిన పసివాళ్ళు ఎవరైనా భారం అనుకున్నా.. పెంచలేరని భావించినా, రైల్వే స్టేషన్ దగ్గర ఉంచిన ఉయ్యాలలో వదిలి వెళ్లాలని ఇప్పటికే ప్రచారం నిర్వహించామన్నారు… అయినా పుట్టిన బిడ్డలను రోడ్డు పక్కన పారేసే సంస్కృతిని కొంతమంది విడిచి పెట్టలేక పోతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం