Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో కొత్తగా కరోనా కేసు.. పాజిటివ్‌‌గా తేలడంతో అప్రమత్తమైన అధికారులు..

ప్రకాశం జిల్లాలో కొత్తగా కరోనా కేసు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కురిచేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ గుంటూరు సమీపంలోని హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నారు.

Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో కొత్తగా కరోనా కేసు.. పాజిటివ్‌‌గా తేలడంతో అప్రమత్తమైన అధికారులు..
Corona Virus

Updated on: Mar 25, 2023 | 5:51 AM

ప్రకాశం జిల్లాలో కొత్తగా కరోనా కేసు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కురిచేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ గుంటూరు సమీపంలోని హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వ్యక్తి ఈ నెల 20న సర్జరీ నిమిత్తం ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది.

కాగా, విషయం తెలుసుకున్న అధికారులు అతని నుంచి నమూనాలు సేకరించి గుంటూరు వైరాలజీ ప్రయోగశాలకు పంపారు. కరోనాపై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు జ్వర సర్వే చేపట్టాలని డీఎంఅండ్‌హెచ్‌వో ఆదేశించారు.

ఇకపై వచ్చే అన్ని పాజిటివ్ కేసులను వైరాలజీ ల్యాబ్‌కు పంపుతామని, ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..