AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే.. ఈ ఆలయంలో అమల్లోకి కొత్త రూల్స్..

ఆలయాలకు వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన ఇప్పటికే చాలాచోట్ల అమల్లో ఉంది. అయితే ఇకపై కేవలం సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే సరిపోదు.. మహిళలు తలకు జడ వేసుకోవాలి, నుదుటిన బొట్టు పెట్టుకోవాలి, చేతులకు గాజులు ఉండాల్సిందే.. లేదంటే గుడి గేటు దాటనిచ్చే ప్రసక్తే లేదంటూ ఓ ప్రముఖ ఆలయ కమిటీ ఆంక్షలు పెట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే.. ఈ ఆలయంలో అమల్లోకి కొత్త రూల్స్..
Atmakuru Temple Imposes Strict Rules On Female Devotees
Ch Murali
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 7:32 PM

Share

ఆలయాలకు వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన ఇప్పటికే పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అమలవుతోంది. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ ఆలయ నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి సరికొత్త ఆచారానికి శ్రీకారం చుట్టారు. కేవలం సాంప్రదాయ దుస్తులు ధరిస్తే సరిపోదు.. మహిళలు నిండైన చీరకట్టుతో పాటు చేతులకు గాజులు, నుదుటిన తిలకం దిద్దుకుని, తప్పనిసరిగా జడ వేసుకుని వస్తేనే గర్భాలయ ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. జుట్టు విరబోసుకుని, బొట్టు లేకుండా వచ్చే భక్తులకు అనుమతి నిరాకరిస్తూ ఆలయ ముఖద్వారం వద్దే భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, పెంచలకోన వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే కాలక్రమంలో పాశ్చాత్య పోకడలు పెరుగుతుండటంతో, హైందవ సంప్రదాయాలను పూర్ణస్థాయిలో పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మహిళలు జుట్టు విరబోసుకుని దేవాలయాలకు రావడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.

ఆత్మకూరు వాసవీ అమ్మవారి ఆలయంలో ఫ్లెక్సీల కలకలం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంతో పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాలను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈసారి దసరా వేళ దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చారు.

నిబంధనలు ఇవే

  • మహిళలు తప్పనిసరిగా సాంప్రదాయ చీరకట్టులోనే రావాలి.
  • నుదుటన బొట్టు, చేతులకు గాజులు ధరించడం తప్పనిసరి.
  • ప్రధానంగా మహిళలు, యువతులు జుట్టు విరబోసుకుని రాకూడదు.. పద్ధతిగా జడ వేసుకుంటేనే ఆలయంలోకి అనుమతిస్తారు.
  • నిబంధనలు పాటించని వారిని గేటు బయట నుంచే వెనక్కి పంపించేలా హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

భక్తుల్లో భిన్నస్వరాలు.. హాట్ టాపిక్‌గా మారిన నిర్ణయం

సనాతన ధర్మం ప్రకారం స్త్రీలు నిండైన వస్త్రధారణతో, సౌభాగ్య చిహ్నాలతో ఆలయాలకు వచ్చినప్పుడే పూజలకు పరిపూర్ణత చేకూరుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు సమర్థిస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం కాపాడేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చామని చెబుతున్నారు. అయితే ఆలయ నిర్వాహకుల తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై భక్తుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు సంప్రదాయాల పరిరక్షణకు ఇది మేలని అంటుంటే.. మరికొందరు నిబంధనల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆత్మకూరు అమ్మవారి ఆలయంలో పెట్టిన ఈ ఆంక్షలు ఉమ్మడి నెల్లూరు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..