తీరం దాటిన ‘నివర్’ తుఫాన్‌.. ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండాలన్న విపత్తుల శాఖ కమిషనర్‌

నివర్ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గరలో బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తుఫాన్‌ తీరం దాటింది

తీరం దాటిన నివర్ తుఫాన్‌.. ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండాలన్న విపత్తుల శాఖ కమిషనర్‌

Edited By:

Updated on: Nov 26, 2020 | 8:27 AM

Nivar Cyclone AP: నివర్ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడు – పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గరలో బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తుఫాన్‌ తీరం దాటింది. ఇది తీవ్ర తుఫానుగా బలహీన పడగా.. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ రోజు చిత్తూరు , కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. (తిరుమలపై ‘నివర్’ తుఫాన్ ఎఫెక్ట్‌.. జలమయమైన శ్రీవారి ఆలయం.. ఇబ్బందులు పడుతున్న భక్తులు)

మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తాను నుంచి తేలిక పాటి వర్షాలు కురవనున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు సూచించారు. ఇళ్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పేర్కొన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. (Bigg Boss 4: మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లిన అఖిల్.. మళ్లీ పులిహోర స్టార్ట్‌ చేసిన అఖిల్‌)