AP Local Body Elections: పెళ్లి బట్టలపైనే పోలింగ్ బూత్‌కు వెళ్లిన నవదంపతులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుని..

AP Local Body Elections: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఆ ప్రాంతం పాలించేందుకు నాయకుడు మంచివాడై ఉండాలి.

AP Local Body Elections: పెళ్లి బట్టలపైనే పోలింగ్ బూత్‌కు వెళ్లిన నవదంపతులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుని..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 13, 2021 | 7:19 PM

AP Local Body Elections: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఆ ప్రాంతం పాలించేందుకు నాయకుడు మంచివాడై ఉండాలి. మరి అలాంటి మంచి నాయకున్ని ఎన్నుకునే గొప్ప అవకాశాన్ని భారత రాజ్యంగం పౌరులకు అందించింది. రాజ్యంగం కల్పించిన ఓటు హక్కు రాజ్యం తలరాతనే మార్చేస్తుంది. అంతటి శక్తివంతమైనది ఓటు. అందుకే ప్రతీ పౌరుడు బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటారు. ఓటు విశిష్ఠత తెలిసివారెవరూ తమ ఓటు హక్కును దుర్వినియోగం చేయరు, వినియోగించకుండా ఉండరు. దీనికి నిదర్శనమై ఘటనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా, చాగల్లు మండలం దారవరంలో చోటు చేసుకుంది.

దారవరం గ్రామంలో నవదంపతులు పెళ్లి బట్టలపైనే పోలింగ్ బూత్‌కు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు విలువ ఏంటో తమకు తెలుసు కాబట్టే తమ ఓటు హక్కును తాము వినియోగించుకున్నామని ఈ జంట చెబుతోంది. బాధ్యతగల పౌరులుగా ఓటు వేయడం తమ విధి అని, తాము అదే పని చేశామని చెప్పుకొచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో దశ పోలింగ్ జరిగింది. గ్రామాల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైన నేపథ్యంలో మంచాన పడ్డ వృద్ధులు మొదలు.. నవదంపతుల వరకు అందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Also read:

Hyper Aadi Marriage Soon : త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న హైపర్ ఆది.. అమ్మాయి ఎవరో తెలుసా..!

‘వ్యవసాయం భారత మాతదే, పారిశ్రామికవేత్తలది కాదు’, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ