AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MPTC Missing: ప్రకాశం జిల్లాలో కనిపించకుండాపోయిన కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ.?

ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం, యనమదల ప్రాదేశికం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా వైకాపా తరఫున విజయం సాధించిన..

MPTC Missing: ప్రకాశం జిల్లాలో కనిపించకుండాపోయిన కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ.?
Mptc
Venkata Narayana
|

Updated on: Sep 22, 2021 | 1:49 PM

Share

MPTC Missing – Prakasam District: ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం, యనమదల ప్రాదేశికం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా వైకాపా తరఫున విజయం సాధించిన, అయిమాల శ్యాంసన్‌ కనిపించడం లేదని ఆయన భార్య పరమగీతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. 19న ఓట్ల లెక్కింపు అనంతరం విజేతగా అధికారుల నుంచి శ్యాంసన్ ధ్రువపత్రం అందుకున్నారు.

ఆ తర్వాత శ్యాంసన్ సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. ఈ విషయమై కేసు నమోదు చేశామని.. సీఐ సుబ్బారావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జీవీ చౌదరి తెలిపారు. శ్యాంసన్‌ అదృశ్యానికి వైకాపాలోని వర్గపోరే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అభ్యర్థి మృతి కారణంగా పోలూరులో ఎన్నికలు నిలిచాయి. మిగతా ఏడింటిలో ఒకటి తెదేపా.. ఆరు వైకాపా సొంతం చేసుకున్నాయి. ఎంపీపీ పదవికి అధికార పార్టీలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆధిక్యం కోసం ఓ వర్గం వారు ఆయనను అపహరించారన్న ప్రచారం సాగుతోంది.

Read also: Village President: గ్రామ సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడ్ని నడిరోడ్డులో బూటుకాలితో తన్నిన సర్పంచ్.!

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. మంత్రి కోమటి రెడ్డి కీలక
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. మంత్రి కోమటి రెడ్డి కీలక
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ