Anandaiah medicine: తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశమంతటా.. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఆయుర్వేద ఆనందయ్య గురించే చర్చ నడుస్తోంది. కరోనా రోగులకు ఆయన పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు సత్ఫలితాలు ఇస్తుండటంతో అందరూ నెల్లూరు జిల్లాలోని ఆనందయ్య గ్రామం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ ప్రతినిధులు సైతం ఈ మందుపై అధ్యయనం చేసేందుకు కృష్ణపట్నం చేరుకున్నారు. ఈ తరుణంలో కరోనా రోగులకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న బొనిగి ఆనందయ్యను అరెస్ట్ చేశారంటూ వాస్తున్న వార్తలపై నెల్లూరు జిల్లా ఎస్పీ స్పందించారు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా ఆనందయ్యకు అనదపు భద్రత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా విచారణ జరుగుతుందని ఆయన్ను అరెస్టు చేయలేదంటూ పేర్కొన్నారు.
కాగా.. ఈ విషయంపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం స్పందించారు. కృష్ణాపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బోనిగి ఆనందయ్య పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం వదంతులు మాత్రమేనని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రజలు సంయమనం పాటించాలంటూ ఎమ్మెల్యే ప్రకటనను విడుదల చేశారు.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఆయుర్వేద ఔషధం పంపిణీని అధికారులు నిలిపివేశారు. పరిశోధనల అనంతరం ఆయుర్వేద మందు పంపిణీపై అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.
Also Read: