Rekha Sharma: శ్రీకాళహస్తి సీఐని అరెస్ట్ చేయండి.. ఏపీ డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ..

|

Oct 04, 2022 | 9:42 PM

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాశారు.

Rekha Sharma: శ్రీకాళహస్తి సీఐని అరెస్ట్ చేయండి.. ఏపీ డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ..
Ci Anju Yadav
Follow us on

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. కాగా.. శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్ దురుసు ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. హోటల్‌లో మద్యం అమ్ముతున్నారనే సమచారంతో అక్కడకు వెళ్లిన సీఐ అంజూయాదవ్.. ఆ హోటల్ నిర్వాహకురాలైన ధనలక్ష్మి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. నడిరోడ్డుపైనే మహిళపై దాడి చేయడమే కాకుండా.. దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. ఈ విజువల్స్ అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.

ఈ విషయం మానవ హక్కుల కమిషన్ వరకూ వెళ్లడంతో.. విచారణ చేపట్టాలని తిరుపతి ఎస్పీ ఆదేశించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన ఎస్పీ విమలకుమారి.. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు. మొత్తం ఇప్పటివరకూ 15 మందిని ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తామన్నారు అడిషనల్ ఎస్పీ విమలకుమారి. అయితే తాను ఏ తప్పూ చేయలేదంటున్నారు సీఐ అంజు యాదవ్. ధనలక్ష్మిని కొట్టలేదంటున్నారు. విచారణ కోసం వెళితే ఆమే తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు.

ఇప్పటికే 15 మందిని విచారించామన్నారు తిరుపతి అడిషనల్ ఎస్పీ విమలకుమారి. మరోవైపు తానే తప్పు చేయలేదంటూ ఆడియో రిలీజ్ చేశారు బాధిత సీఐ అంజు యాదవ్. ఈ సందర్భంలో రేఖాశర్మ డీజీపీకి లేఖ రాయడంతో.. ఆమెపై చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం