National Award to APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అవార్డుల పంట పండింది. ఐటీ విభాగంలో ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా రెండో సారి జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2021 ఏడాదికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో ‘డిజిటల్ టెక్నాలజీ సభ’ అవార్డు ఏపీఎస్ఆర్టీసీకి దక్కింది. జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో పోటీ పడి ఈ అవార్డును ఏపీఎస్ఆర్టీసీ కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ చేస్తోంది. ఈ విధానాలను ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తున్నందుకు గానూ ఏపీఎస్ ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. వర్చువల్ సెమినార్ ద్వారా అవార్డు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఆర్పీఠాకూర్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, ఐటీ విభాగంలో గతేడాది కూడా డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డును ఏపీఎస్ ఆర్టీసీ అందుకుంది.
Also read:
విజయ్ హజారే ట్రోఫీలో విజృంభించిన యూపీ బౌలర్.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టేశాడు..
ఎంత మంది పిల్లలో నాకే తెలియదు.. సంచలన నిజాలు వెల్లడించిన సాకర్ దిగ్గజం..