కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం తారాస్థాయికి చేరింది. పాదయాత్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవిపై సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్. చర్లో కొత్తూరు గ్రామానికి చెందిన దళితుల భూములు ఎమ్మెల్యే.. ఆమె అనుచరులు కబ్జా చేశారంటూ ఆరోపించారు లోకేష్.
నారా లోకేష్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే శ్రీదేవి. మహిళా ఎమ్మెల్యేపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల భూములు కబ్జాపై.. తనకు, తన అనుచరులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. లోకేష్ చేసిన ఆరోపణలపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే శ్రీదేవి.
ఎమ్మెల్యే సవాల్ కు కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. పేరేముల గ్రామంలోని సర్వే నెంబర్ 249, 250 సర్వే నెంబర్‌లో ఉన్న 25 ఎకరాల భూమిని 1986లో గోపాల్ నాయక్ ఆనంద నాయక్ నుంచి 12 మంది దళితులు కొనుగోలు చేస్తే.. ఆ భూమిని 2020లో ఓబులాపురానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద వైసీపీ నేతలు దొంగ డాక్యుమెంట్లతో ఆన్లైన్ చేసుకున్న ఆధారాలను బయటపెట్టారు. అయితే, లోకేష్ దళితుల భూములు కబ్జాకు గురైనట్లు విడుదల చేసిన డాక్యుమెంట్స్ పై ఎమ్మెల్యే ఏవిధంగా రియాకర్ట్ అవుతారో చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..