AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే రిలీజ్..

ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త తెలిపారు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌పై క్లారిటీ ఇచ్చారు. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడినట్లయిందని చెప్పవచ్చు.

Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే రిలీజ్..
Unemployes
Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 8:14 AM

Share

ఏపీలోని నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారు. ప్రతీ ఏడాది ముందుగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. గురువారం ఉండవల్లి నివాసంలో ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమవేశమయ్యారు. పరీక్షలు, జాబ్ మేళాలు, ఉద్యోగాల భర్తీపై చర్చించారు. ఈ సందర్బంగా జాబ్ క్యాలెండర్ విడుదలకు లోకేష్ ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఉద్యోగ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై గత కొద్ది కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో లోకేష్ కీలక ప్రకటన చేశారు.

ఉగాది గిఫ్ట్

నిరుద్యోగులకు నారా లోకేష్ ఉగాది గిఫ్ట్ ప్రకటించారు. వచ్చే నెలలో రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని సూచించారు. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. ఇక త్వరలోనే నైపుణ్య వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. పోర్టల్ కోసం ఇప్పటికే మాడ్యూల్స్ సిద్దం కాగా.. 25 రకాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇందులో రిజిస్టర్ అవ్వగా.. అభ్యర్థులు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించారు. 16 మంది రిక్రూటర్స్ సిద్దంగా ఉండగా.. 1,14,899 ఉద్యోగాలు సిద్దంగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఐటీఐలకు అనుబంధంగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

జాబ్ క్యాలెండర్‌ వల్ల లాభమేంటి..?

ఈ ఏడాది ఏయే శాఖలో ఎన్ని ఉద్యోగులను భర్తీ చేస్తామనేది జాబ్ క్యాలెండర్‌లో ముందుగానే పొందుపరుస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది.. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు? అనే వివరాలు ఇందులో ఉంటాయి. దీని వల్ల జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ముందే తెలియడం వల్ల పరీక్షలకు ముందుగానే ప్రిపేర్ అవ్వవచ్చు. ప్రిపరేషన్‌కు తగినంత సమయం ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్‌కు తగ్గట్లు నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు ప్రణాళికలు వేసుకోవచ్చు. దీంతో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us