Nara Lokesh Challenge: ఆయనకు సవాల్ చేస్తే విజయసాయి స్పందించడం ఏంటి?.. లోకేష్ మరో సవాల్..!

|

Jan 02, 2021 | 3:45 PM

Nara Lokesh Challenge: రామతీర్థం ఉద్రిక్తత నేపథ్యంలో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కీలక నేతల మధ్య మాటల యుద్ధం..

Nara Lokesh Challenge: ఆయనకు సవాల్ చేస్తే విజయసాయి స్పందించడం ఏంటి?.. లోకేష్ మరో సవాల్..!
Follow us on

Nara Lokesh Challenge: రామతీర్థం ఉద్రిక్తత నేపథ్యంలో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కీలక నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలను మరింత రంజింప చేస్తున్నారు. తొలుత వైసీపీ నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని, సిహాంద్రి అప్పన్నప్రై ప్రమాణం చేసేందుకు సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో సీఎం జగన్ కూడా సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చేసేందుకు రావాలంటూ లోకేష్ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. లోకేష్ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో లోకేష్‌తో చర్చలకు తాను వస్తానని ప్రకటించారు.

అయితే, తన సవాల్‌కు విజయసాయి స్పందించడం ఏంటంటూ నారా లోకేష్ మండిపడ్డారు. తాను జగన్‌ రెడ్డికి సవాల్ విసిరితే.. విజయసాయి స్పందిస్తారేంటి? అంటూ మరోసారి ట్విటర్ వేదికగా రెచ్చిపోయారు. జగన్‌కు ధైర్యం లేదా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘దైవం మీద ప్రమాణం అనగానే చర్చ అంటూ పారిపోతున్నారు. నాపై వైసీసీ నేతలు చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదనే అంశం ఇక్కడే తేలిపోయింది’ అని లోకేష్ పేర్కొన్నారు. కాగా, తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధం అని, జగన్ సిద్ధమా? అంటూ లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. మరి ఈ సవాళ్ల రాజకీయం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

 

Also read:

నేపాల్ సంక్షోభ పరిష్కారానికి ఎన్నికలు జరగాలి, ఇండియా పరోక్ష సూచన, చైనాకు చెక్ పెట్టేందుకేనా ? పీఎం ఓలి ఎటువైపు ?

SEBI Fine On Mukesh: ముకేష్‌ అంబానీకి భారీ జరిమానా విధించిన సెబీ… షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలే కారణం..