శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి.. పరమ శివుడికి రుద్రాభిషేకం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి.. పరమ శివుడికి రుద్రాభిషేకం
Nara Bhuvaneswari In Srisailam

Edited By: Balaraju Goud

Updated on: Aug 03, 2024 | 5:12 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరికి ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అర్చకస్వాములు స్వామి అమ్మవార్ల విభూతి తిలకం భువనేశ్వరికి అందించగా, నుదిటిన తిలకధారణ చేసుకున్న భువనేశ్వరి రాజగోపురం ముందు బాగంలోని ద్వజ స్దంభానికి నమస్కరించారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంభాదేవి అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏఈవో హరిదాస్ స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు. అర్చకులు వేదపండితులు వేదాశీర్వచనలు చేసి తీర్ధప్రసాదాలనిచ్చి దీవించారు. నారా భువనేశ్వరితోపాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సతీమణి కూడా ఉన్నారు.

వీడియో చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..