Andhra: హాయ్ పెట్టు.. ఎఫ్ఐఆర్ కాపీ పట్టు.. ఎస్పీ సార్ సూపర్ ఐడియా

బాధితులకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నంద్యాల జిల్లా పోలీసులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సూచనలతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీని నేరుగా వాట్సాప్‌లోనే పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Andhra: హాయ్ పెట్టు.. ఎఫ్ఐఆర్ కాపీ పట్టు.. ఎస్పీ సార్ సూపర్ ఐడియా
Sp Sunil Sheran Initiative

Edited By:

Updated on: Dec 25, 2025 | 12:29 PM

పోలీస్ బాధితుల సంఖ్యను తగ్గించేందుకు నంద్యాల జిల్లా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలంటే పోలీసుల నుంచి ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో.. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. పోలీసులకు అవసరం అనుకుంటే ఎఫ్ఐఆర్ కాపీ క్షణాల్లో బయటికి వస్తుంది.. దాని నుంచి ప్రయోజనం లేదు అనుకుంటే ఎన్నిసార్లు తిరిగినా, గీపెట్టిన బయటకు రాదు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నూతన ఉరవడికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ చెబుతున్నారు.

ఇక నుంచి వాట్సాప్ లోనే అన్ని సేవలు పొందవచ్చని ప్రభుత్వమే అంటోంది. అలాంటప్పుడు బాధితులు ఎఫ్ఐఆర్ కాపీ కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చని ఎస్పీ సూచిస్తున్నారు. కేసు నమోదైన వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ వాట్సాప్ ద్వారా పొందవచ్చు. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముందుగా 95523 00009 నెంబర్‌కి హాయ్ అని పెట్టాలి. ఆ తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ కాఫీ పొందవచ్చు. అత్యంత గోప్యత ఉన్న కేసులకు మాత్రం పోలీసులు కొంత రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ముందుగా పైన తెలిపిన నంబర్‌కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టాలి. అనంతరం స్క్రీన్‌పై కనిపించే సేవలలో పోలీసు సర్వీసులను ఎంచుకోవాలి. ఎఫ్ఐఆర్ నంబరు, జిల్లా, పోలీస్ స్టేషన్ వివరాలు, సర్వీస్ వివరాలకు సూచనలు వస్తాయి. వాటి నమోదు పూర్తయ్యాక సెల్ ఫోన్‌కి ఓటిపి వస్తుంది. ఆ నంబర్‌ను ధ్రువీకరించిన వెంటనే పిడిఎఫ్ ఫార్మాట్లో ఎఫ్ఐఆర్ కాపీ వాట్సాప్‌కి వస్తుంది. దీనికే పోలీసులు హాయ్ పెట్టు ఎఫ్ఐఆర్ కాపీ పట్టు అని అవగాహన కల్పిస్తున్నారు. సో మిగతా జిల్లాల పోలీసులు కూడా ఇలా ఫాలో అయితే బాగుంటుంది కదా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.