Andhra Pradesh: కరాటేలో కర్నూల్‌ విద్యార్ధిని సత్తా.. బరిలో దిగితే బంగారు పంట పండినట్లే!

Nandyal Engineering student Kalpana: బంగారు కల్పన మైదానంలో అడుగుపెట్టిందంటే ఇక బంగారమే. ప్రత్యర్థులకు చెమట పట్టాల్సిందే. ఆట మొదలెట్టిందంటే చాలు ఇక బంగారు పంట పండినట్లే.. ఇది నంద్యాల జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని కల్పన విజయ గాధ. మీరూ తెలుసుకోండి..

Andhra Pradesh: కరాటేలో కర్నూల్‌ విద్యార్ధిని సత్తా.. బరిలో దిగితే బంగారు పంట పండినట్లే!
Nandyal Engineering Student Kalpana

Edited By: Srilakshmi C

Updated on: Dec 12, 2025 | 7:53 PM

కర్నూలు, డిసెంబర్‌ 12: బంగారు కల్పన మైదానంలో అడుగుపెట్టిందంటే ఇక బంగారమే. ప్రత్యర్థులకు చెమట పట్టాల్సిందే. ఆట మొదలెట్టిందంటే చాలు ఇక బంగారు పంట పండినట్లే.. ఇది నంద్యాల జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కల్పన విజయ గాధ.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం లింగం దిన్నె గ్రామానికి చెందిన కల్పన చదువుతోపాటు ఆత్మ రక్షణ క్రీడలో రాణిస్తోంది. కరాటే లో కల్పన సాధిస్తున్న విజయాలు అన్ని ఇన్ని కావు. నంద్యాల పట్టణ శివారులోని ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది కల్పన. మొదటి నుంచి ఆమె కరాటే పై దృష్టి సారించింది. అవసరమైన నైపుణ్యాలు పెంచుకొని వివిధ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతోంది. 2022లో మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పసిడి పథకంతో అందరి మన్ననలు అందుకుంది. శభాష్ కల్పన అంటూ అందరూ సన్మానించారు.

ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభంలో కర్నూలులో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రత్యర్థులను మట్టి కల్పించి మరోసారి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ కరాటేకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నానని కళాశాల చదువు పూర్తి అయిన తర్వాత నిత్యం శిక్షణ పొందనున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కరాటేలో రాణించాలన్నదే తన లక్ష్యమని అంటున్నారు. కల్పన కళ నెరవేరాలని ఆశిద్దాం..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.