AP-TS Border: ఈ లేడీ భలే కిలాడీ.. పోలీసులకే షాక్.. సొరంగంలో మద్యం సీసాలు దాచి మరీ విక్రయం..

| Edited By: Surya Kala

Nov 03, 2023 | 11:18 AM

పోలీసులు ఆ మహిళను తమదైన స్టైల్ లో ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ తాను మద్యం దాచిన ప్లేస్ చూపించింది. ఆమె చూపించిన ప్లేస్.. అక్రమ మద్యాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఎందుకంటే అలనాటి రాజుల కాలంలో నిధినిక్షేపాలను సొంరంగాల్లో దాచినట్లు ఈ మహిళ తెలంగాణ నుంచి తెచ్చిన మందుని దాచడం కోసం ఓ సొరంగం తవ్వింది. అందులో మద్యం సీసాలను దాచి పెట్టి అక్రమంగా అమ్ముతుంది..

AP-TS Border: ఈ లేడీ భలే కిలాడీ.. పోలీసులకే షాక్.. సొరంగంలో మద్యం సీసాలు దాచి మరీ విక్రయం..
Liquor In Ap
Follow us on

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ లో అక్రమ మద్యం ఏరులైపారుతుంది. తెలంగాణ నుంచి తెచ్చి ఓ మహిళ అక్రమంగా మద్యం అమ్ముతోందని నందిగామ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు మహిళ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎంతగా వెదికినా పోలీసులకు ఇంట్లో ఎక్కడా మందు దొరకలేదు. అయితే పోలీసులకు అందిన సమాచారం మాత్రం పక్క.. దీంతో పోలీసులు ఆ మహిళను తమదైన స్టైల్ లో ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ తాను మద్యం దాచిన ప్లేస్ చూపించింది. ఆమె చూపించిన ప్లేస్.. అక్రమ మద్యాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఎందుకంటే అలనాటి రాజుల కాలంలో నిధినిక్షేపాలను సొంరంగాల్లో దాచినట్లు ఈ మహిళ తెలంగాణ నుంచి తెచ్చిన మందుని దాచడం కోసం ఓ సొరంగం తవ్వింది. అందులో మద్యం సీసాలను దాచి పెట్టి అక్రమంగా అమ్ముతుంది..

 

నందిగామ పోలీసులు భారీగా మద్యం నగదును స్వాధీనం చేసుకున్నారు.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నాగమణి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మనసాగరంలోని ఓ ఇంటివద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో సొరంగంలా తవ్వి దానిలో తెలంగాణనుంచి తెచ్చిన 90 మద్యం బాటిల్స్  దాచిపెట్టింది నాగమణి. పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా కొంత కాలంగా ఇలాగే మద్యం అమ్ముతుంది ఆ మహిళ..

ఇవి కూడా చదవండి

నాగమణి వ్యవహారం పోలీసులకు తెలియడంతో గుంతలు తవ్వి చూసి , దాచి ఉంచిన మద్యం సీసాలు చూసి అవాక్కయ్యారు పోలీసులు.. నందిగామ సిఐ హనీష్ బృందం ఈ అక్రమ మద్యాన్ని గుట్టురట్టు చేసింది. అంతేకాదు అక్రమంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని నందిగామ డిఎస్పి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..