Corona: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్… సోషల్ మీడియా ద్వారా వెల్లడి…

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు

Corona: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్... సోషల్ మీడియా ద్వారా వెల్లడి...

Edited By:

Updated on: Dec 30, 2020 | 7:20 AM

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిల్పా రవి సోషల్‌మీడియా ద్వారా తెలిపాడు.  తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా‌ పరీక్షలు చేయించుకోవాలని,స్వీయ నిర్బంధలో ఉండాలని శిల్పా రవి పిలుపునిచ్చారు. కాగా, ఎమ్మెల్యే రవి డిసెంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 28 వరకు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అందరికీ నమస్కారం..
నేను మీ శిల్పా రవి రెడ్డిని.. ప్రస్తుతం నాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినది. నా ఆరోగ్యం నిలకడగానే…

Posted by Silpa Ravi Reddy on Tuesday, December 29, 2020