Janasena: కొణతాల రామకృష్ణ ఇంటికి జనసేన నేత నాగబాబు.. ఏం చర్చించబోతున్నారు..?

|

Feb 17, 2024 | 8:01 AM

జనసేన నేత నాగ బాబు కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. నాగబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముకంగా ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇటీవల నాగబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఎక్కడా కనిపించలేదు.

Janasena: కొణతాల రామకృష్ణ ఇంటికి జనసేన నేత నాగబాబు.. ఏం చర్చించబోతున్నారు..?
Nagababu
Follow us on

జనసేన నేత నాగ బాబు కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. నాగబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముకంగా ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇటీవల నాగబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఎక్కడా కనిపించలేదు. రాజకీయంగా అనుభవం ఉన్న నేత కొణతాల లేకుండా నాగ బాబు పర్యటనపై అప్పట్లో జనసేన కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా చర్చజరిగింది. ఇదిలా ఉంటే దీనిపై కొణతాల క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నాగబాబు పర్యటనపై తనకు కనీస సమాచారం లేకపోవడం వల్లే గైర్హాజరైనట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి.అలాగే నాగబాబు అనకాపల్లి పర్యటన సమయంలో తాను స్థానికంగా అందుబాటులో లేనని.. అందుకే ఆయన నిర్వహించిన కార్యక్రమాల్లో హాజరు కాలేక పోయానని కొణతాల చెప్పినట్టు సమాచారం.

ఇలాంటి వార్తలు షికారు చేస్తున్న తరుణంలో త్వరలోనే కొణతాల రామకృష్ణ, నాగబాబు కలిసి పర్యటించేలా జనసేన ఏర్పాట్లు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. గతంలో తెలుగుదేశం, వైసీపీలో పని చేసి అక్కడి నుంచి బయటకు వచ్చిన కొణతాల అనకాపల్లి ఎంపి రేస్ లో ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో నాగబాబు కూడా అదే స్థానాన్ని ఆశించడంతో రాజకీయంగా పెను చర్చకు దారి తీసింది. అయితే సొంత అన్నకు టికెట్ ఇస్తారా, లేకపోతే సీనియర్ నేతగా, రాజకీయంగా అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు అనకాపల్లి టికెట్ ఇస్తారా అన్న దానిపై జనసేనాని క్లారిటీ ఇవ్వాల్సి్ ఉంది. ఏది ఏమైనా ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో పొత్తులు, చేరికలు, టికెట్ల వ్యవహారంతో ఏపీ రాజకీయం అగ్గిరాజేస్తోంది.

ఇక కొణతాల రామకృష్ణ గురించి ఒక్కసారి గమనిస్తే.. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా పేరున్న నాయకుడు. మొన్నటి వరకూ ఏ పార్టీలోనూ లేరు. ఆయన అన్ని పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ కొంతకాలంగా యాక్టివ్ కావడంతో ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్‎ సమక్షంలో జనసేనలో చేరి ప్రచారానికి అనుగుణంగానే కొణతాల ముందుకు సాగారు. పార్టీలో చేరే సమయంలోనే ఆయన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. అప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని పవన్ స్పష్టం చేయడంతో కొణతాల బరిలో నిలిస్తే గెలుపు ఖాయమని ఆయన అనుచరులు భావించారు. అయితే తాజాగా నాగబాబు అంశం తెరపైకి రావడంతో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..