జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు జోష్ కొనసాగుతోంది. ఈ నెల 18న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. దాంతో.. జనసేన సభ్యత్వాలు నమోదు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్లు జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు వెల్లడించారు. గత ఏడాది కంటే భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ఆదివారంతో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియగా.. విశేష స్పందన నేపథ్యంలో మరో వారం రోజులు పొడిగించినట్లు తెలిపారు నాగబాబు. ప్రతి నియోజకవర్గంలో 5 వేల సభ్యత్వాలు కావాలని నాగబాబు పార్టీ నేతలకు సూచించారు.
ఇక.. గతంలో 6లక్షల 47వేల సభ్యత్వాలు నమోదు కాగా.. తాజాగా.. ఇప్పటికే 10లక్షలకు చేరడంపై జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. జనసేన సభ్యత్వం స్వీకరించిన కొత్తవారు ఎవరు?.. ఏ పార్టీ కార్యకర్తలు, నేతలు.. జనసేన సభ్యత్వం స్వీకరిస్తున్నారనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..