Janasena: ఏపీ( Andhra Pradesh) లో వైసిపీ నేతలు, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది. తాజాగా జనసేన అధినేత ఏపీ ప్రభుత్వం (AP Government) తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను పీడించి వేధించి ఖజానా నింపుకోవాలని అహంకారపూరితమైన నైజంతో సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నమొన్నటి వరకూ ఓటీఎస్ పేరుతో పేదల ముక్కుపిండి వందల కోట్ల రూపాయలను వసూలు చేసిన ఏపీ సర్కార్ ఇప్పుడు.. ఆస్థి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్నుల విధానంతో ప్రజల గౌరవ మర్యాదలకు భంగంకలిగేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పడేస్తున్నాం కదా.. ప్రజలు మా దగ్గర పడి ఉండాల్సిందే అన్న నియంతృత్వ ధోరణి వైసీపీలో కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇదేనా వైసిపీ చెబుతోన్న సంక్షేమ పాలన అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ అహంకారంతో ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం ప్రజలను ఈ విధంగా కించపరిచింది లేదని అన్నారు.
పిఠాపురం మున్సిపాలిటీలో ఇంట్లో మహిళలు ఉండగానే బయట తాళాలు వేయడం సరికాదని అన్నారు. అది అక్రమ నిర్బంధమే అవుతుందని చెప్పారు. ఇది కచ్చితంగా క్రిమినల్ చర్య అని అన్నారు. ఆస్థి పన్ను వాసులు కోసం జప్తు వాహనాలు తిప్పుతూ పన్ను కట్టక పొతే ఇంట్లో సామన్లు పట్టుకుపోతామని బ్యానర్లు కట్టుకుని తిరగడం వైసీపీ పాలకుల దోపిడీ మనస్తత్వాన్ని వెల్లడింస్తోందని అన్నారు. ప్రజలు ఓ వైపు తాగునీటికి అల్లాడుతుంటే.. మరోవైపు కుళాయిలు బిరడాలు వేసి వేధిస్తున్నారు. చెత్త పన్ను కట్టక పొతే.. చెత్తను తెచ్చి దుకాణాల ముందు, ఇళ్ల ముందు పోస్తున్నారు. ఈ వైఖరి పాలకుల మనస్తత్వాన్ని వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు. ఆస్థి పన్ను కట్టక పొతే.. జప్తు చేసే అధికారం మున్సిపల్ అధికారులకు లేదు.. ఆ పని కలెక్టర్లు చేయాలి. అసలు రాష్ట్రంలోని కలెక్టరేట్లే ఆస్థి పన్ను కోట్లల్లో బకాయి ఉన్నారు.. ఆస్తులు జప్తు చేయాల్సి వస్తే,.. ముందు కలెక్టర్ ఆఫీసులను జప్తు చేయాలనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త ఇంటి ముందు పోస్తే.. వివిధ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులనుదాఖలు చేయవచ్చని బాధితులకు సూచించారు. ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం తీరుని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.
Also Read: