Janasena: పొత్తులపై త్వరలోనే క్లారిటీ.. నాదెండ్ల మనోహర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనసేన ప్రణాళికలు రూపొందిస్తోంది. పొత్తుల విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్...

Janasena: పొత్తులపై త్వరలోనే క్లారిటీ.. నాదెండ్ల మనోహర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Nadendla Manohar
Follow us

|

Updated on: Dec 12, 2022 | 9:06 AM

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనసేన ప్రణాళికలు రూపొందిస్తోంది. పొత్తుల విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పొత్తులపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు. జనవరి 12న రణస్థలంలో ‘యువశక్తి’ కార్యక్రమం నిర్వహిస్తామన్న నాదెండ్ల.. అందుకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక, ఎన్నికలకు ఎలా సిద్ధం కాబోతున్నామో అందరికీ పారదర్శకంగా తెలియజేస్తామని వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న మనోహర్.. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మభ్యపెట్టిందని విమర్శించారు.

కాగా.. తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్‌ వివరాలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనతో క్షేత్ర స్థాయి నేతలు అలర్ట్ అయ్యారు. ఏపీలో జనవాణి కార్యక్రమంతో తన గ్రాఫ్ పెంచుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనన పార్టీని విస్తరింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..